కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) గతేడాది అక్టోబర్ నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను కలచివేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్.. ఇలా ఎంతోమంది టాలీవుడ్ నటులు బెంగళూరుకు వెళ్లి పునీత్ కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అయితే ఈ సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప (Pushpa) షూటింగ్ లో బిజీగా ఉండడంతో అప్పూ అంత్యక్రియాలకు రాలేకపోయాడు. ఈక్రమంలో నేటి(ఫిబ్రవరి3) ఉదయం విమానంలో బెంగళూరుకు వెళ్లిన బన్నీ పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ (Shivrajkumar) ను బన్నీ కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం అప్పూ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.
కాగా గతేడాది పుష్ప సినిమా ప్రమోషన్ సమయంలో చాలా రోజుల పాటు బెంగళూరులోనే ఉన్నాడు బన్నీ. అప్పుడే పునీత్ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉన్నా వెళ్లలేదు. అందుకు గల కారణాన్ని కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘పునీత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. అప్పూ మరణ వార్త విని షాకయ్యాను. ఎంతో కష్టంగా అనిపించింది. సినిమా ప్రమోషన్‌కు వచ్చి పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించడం సమంజసం కాదు. త్వరలోనే మళ్లీ ఇక్కడకు వస్తాను. అప్పూ కుటుంబ సభ్యులను కలుస్తాను’ అని చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లే ఇప్పుడు బెంగళూరుకు వెళ్లి పునీత్‌కు నివాళి అర్పించాడు బన్నీ. కాగా గతేడాది అక్టోబర్ 29 ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె పోటు వచ్చింది. ఆయనను వెంటనే బెంగుళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. ఆస్పత్రికే వెళ్లిన కొద్ది సేపటికే పునీత్ తుది శ్వాస విడిచారు.
Nayanthara: హైదరాబాద్ లో సందడి చేసిన నయనతార.. ఆ సినిమా షూటింగ్ కోసమేనా?
Bhaskar Naidu: ఆ విమర్శల్లో వాస్తవం లేదు.. భాస్కర్ నాయుడికి వైద్య సాయంపై TTD వివరణ