Niharika Konidela and Chaitanya Jonnalagaddas wedding : కొణిదెల వారింట మొదలైన పెళ్లి సందడి గురించే ఇప్పుడు అంతటా చర్చ. మెగా ఇంట పెళ్లి వేడుక అంటే ఓ రేంజ్‌లో ఉంటదనే విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో జరగబోతున్న నిహారిక-చైతన్యల వివాహానికి కొణిదెల, అల్లువారి కుటుంబాలు వెళ్లాయి. ప్రైవేటు విమానాల్లో ఈ కుటుంబాలు వివాహ వేడుకకు పయనమయ్యాయి. అల్లు అరవింద్, నిర్మల, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అయాన్, అర్హ ఓ విమానంలో.. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన మరో విమానంలో ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. వారి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తానికి కొణిదెల వారి పెళ్లిలో అల్లువారి హంగామా ఓ రేంజ్‌లోనే ఉండనుంది.
డిసెంబరు 9న గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నాగబాబు కూతురు నిహారిక వివాహం జరగనుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ జంట ఒక్కటికానుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికైంది. వధూవరులు, వారి తల్లిదండ్రులు, వరుణ్ తేజ్, కల్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత తదితరులతో పాటు కొణిదెల, అల్లువారి ఫ్యామీలీస్ అక్కడకి వెళ్లాయి.
Megastar @KChiruTweets & Surekha , Mega Powerstar @AlwaysRamCharan & @upasanakonidela at Udaipur for @IamNiharikaK‘s wedding pic.twitter.com/hlgciIvwoy
— BARaju (@baraju_SuperHit) December 7, 2020
Allu Family off to Udaipur today to attend @IamNiharikaK ‘s Wedding#AlluAravind @alluarjun #AlluFamily pic.twitter.com/IbH2r6r86P
— BARaju (@baraju_SuperHit) December 7, 2020
కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిహారిక పెళ్లి జరగనుంది. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సన్నిహిత వర్గాల కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి పెళ్లికానుకగా నిహారికకు ఖరీదైన డైమండ్ నెక్లెస్ రెడీ చేశారట. దాని విలువ సుమారు రూ.కోటిన్నర అట. అలాగే చైతన్యకు కూడా అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారట.