సల్మాన్‌ ప్రేమ కథలో అలియా

20ఏళ్ల తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించబోతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇన్షాల్లా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుబోతున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన అలియా నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రంపై సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘‘20ఏళ్ల తరువాత మళ్లీ సంజయ్‌తో పనిచేయబోతున్నాను. ఆయనతో, […]

సల్మాన్‌ ప్రేమ కథలో అలియా

Edited By:

Updated on: Feb 14, 2020 | 2:14 PM

20ఏళ్ల తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించబోతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇన్షాల్లా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుబోతున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన అలియా నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

ఇక ఈ చిత్రంపై సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘‘20ఏళ్ల తరువాత మళ్లీ సంజయ్‌తో పనిచేయబోతున్నాను. ఆయనతో, అలియాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టాడు.

మరోవైపు దీనిపై అలియా భట్ సోషల్ మీడియలో స్పందిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘‘తొమ్మిది సంవత్సరాల వయసునున్నప్పుడు మొదటిసారి సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కు వెళ్లాను. అప్పుడు అతడి తదుపరి చిత్రంలో తాను నటించాలని కోరుకున్నా. ఆ కోరిక ఇన్ని రోజులకు తీరింది. సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టింది. కాగా సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో చివరగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.