Gangubai Kathiawadi : మహేశ్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అలియా భట్(Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో మొదలై ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’ తదితర హిట్ చిత్రాలతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోందీ అందాల తార. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’ (Gangubai Kathiawadi). సంజయ్ లీలా భన్సాలీ ఈ పిరియాడికల్ డ్రామాను తెరకెక్కించాడు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 25న హిందీతో పాటు తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే దాదాపుగా రూ.50కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ సుమారు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూబాయి కతియవాడి ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బాలీవుడ్ సినీ వర్గాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. గంగూబాయి సినిమాకు గాను అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ లాలా అనే పాత్రలో నటించిన అజయ్ దేవ్‌గన్ కూడా రూ.11 కోట్లు పారితోషకం తీసుకున్నాడని సమాచారం. ఈ వార్తలు వాస్తవమైతే అలియా మరో పారితోషకం పరంగా రికార్డు సృష్టించినట్లే. అందం, అభినయం పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న అలియా ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. దీంతో పాటు ‘డార్లింగ్స్’, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రాల్లో నటిస్తోంది.
జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే
IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!