జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే
ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్(JEE Mains) పరీక్ష నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల(Schedule Released) చేసింది....
ఈ ఏడాది రెండు విడతల్లో మాత్రమే జేఈఈ మెయిన్(JEE Mains) పరీక్ష నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల మండలి (NTA) వెల్లడించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల(Schedule Released) చేసింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ (పరీక్షలు) డా. సాధనా పరాషర్ వెల్లడించారు. పరీక్షలు రాసే అభ్యర్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించారు. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహిస్తే చాలని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్.. గురువారం విడుదలైన విషయం తెలిసిందే. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఈ పరీక్ష నిర్వహిస్తున్న బాంబే ఐఐటీ గురువారం సమగ్ర వివరాలు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు జూన్ 8 నుంచి జూన్ 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫలితాలను జులై 18న వెల్లడించగా.. ఆ మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రకటించింది.
Also Read
UP Elections 2022: ఆరో దశ ఎన్నికల్లో నేర చరిత్ర నాయకులు అధికమే.. కోటీశ్వరులు ఎక్కువే.. వివరాలివే
Operation Ganga: ప్రతి ఒక్క భారతీయుడినీ స్వదేశానికి చేర్చడమే.. ఆపరేషన్ గంగ ప్రధాన లక్ష్యం
Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..