చిత్ర పరిశ్రమలో 4 దశాబ్ధాలు పూర్తిచేసుకున్న ఆలీ

| Edited By:

Feb 19, 2019 | 9:56 AM

నవ్వులు పంచే ఆలీ తెలుగుప్రేక్షకులందరికీ సుపరిచితమే. అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1979లో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఆలీ.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఆయనని ఈ నెల 23న ఘనంగా సన్మానించాలని భావించింది. విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు […]

చిత్ర పరిశ్రమలో 4 దశాబ్ధాలు పూర్తిచేసుకున్న ఆలీ
Follow us on

నవ్వులు పంచే ఆలీ తెలుగుప్రేక్షకులందరికీ సుపరిచితమే. అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1979లో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఆలీ.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఆయనని ఈ నెల 23న ఘనంగా సన్మానించాలని భావించింది. విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీరంగ ప్రముఖులు కె.రాఘవేంద్ర రావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారు. 1981లో విడుదలైన సీతాకోక చిలుక సినిమాకి గాను ఆలీకి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత యమలీల చిత్రంలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.