సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన అక్షయ్ కుమార్.. “రామసేతు” గురించి సీఎంతో చర్చించిన హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో మంగళవారం రాత్రి సీఎం యోగి అక్షయ్ భేటీ అయ్యారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన అక్షయ్ కుమార్.. రామసేతు గురించి సీఎంతో చర్చించిన హీరో

Updated on: Dec 02, 2020 | 10:26 AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో మంగళవారం రాత్రి సీఎం యోగి అక్షయ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మద్య అక్షయ్ నటిస్తున్న రామసేతు సినిమా గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ‘రామసేతు’ సినిమాను అభిషేక్ శర్మ డైరక్ట్ చేస్తున్నారు. రామసేతు వంతెనకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.

అదేవిధంగా నోయిడాలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్లు గ‌త సెప్టెంబ‌ర్‌లో సీఎం యోగి ఓ ప్రణాళిక‌ను రిలీజ్ చేశారు. దీనిపైన కూడా అక్షయ్ సీఎం యోగితో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ ఫిలింసిటీ ఏర్పాటుపై చర్చించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం బాలీవుడ్ చిత్రనిర్మాతల ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు నిర్మాత రాహుల్ మిత్రా తెలిపారు. ఈ మేరకు బాలీవుడ్ మేటి నిర్మాత‌లు సుభాష్ ఘాయ్, బోనీ కపూర్, రాజ్‌కుమార్ సంతోషి, సుధీర్ మిశ్రా, రమేష్ సిప్పీ, టిగ్‌మన్‌షు ధులియా, మాధుర్ భండార్కర్, ఉమేష్ శుక్లా, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గడా, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు సీఎం యోగితో భేటీకానున్నారు.