ఆర్ఆర్ఆర్: అజయ్‌ దేవగన్‌కు షాకింగ్ రెమ్యునరేషన్..?

| Edited By:

Feb 07, 2020 | 8:01 PM

టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు […]

ఆర్ఆర్ఆర్: అజయ్‌ దేవగన్‌కు షాకింగ్ రెమ్యునరేషన్..?
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు అజయ్. కాగా ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన పాత్ర ఉండబోతున్నట్లు ఓ సందర్భంలో రాజమౌళి వెల్లడించారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన పాత్ర దాదాపు అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ 30నిమిషాల పాత్ర కోసం ఆయన రూ.25కోట్లు డిమాండ్ చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే సినిమా యూనిట్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మంచి రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినా.. అజయ్‌ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే చిరంజీవి సైరాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించగా.. ఆ మూవీ కోసం ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోనట్లు చిరు పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీని తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో మంచి అంచనాలు ఉన్నాయి.