టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారం గా తెరకెక్కుస్తున్న ‘మేజర్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు శేష్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా దూళిపాళ్ల – బాలీవుడ్ హీరోయిన్ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా అడవి శేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా లుక్ టెస్ట్ ఎలా జరిగిందో వివరించాడు.
“26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. అక్కడ న్యూస్ లో చూస్తున్నప్పుడు ఉన్ని కృష్ణన్ ఫోటో చూసాను. చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్య లా అనిపించారు. ఆయన పైన వచ్చిన ప్రతి న్యూస్ ను కట్ చేసి దాచుకున్నాను. మేజర్ లాంటి సినిమాను తీయాలనుకున్నప్పుడు ఆయన కుటుంబసభ్యులను కలిసాను. పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నారా అని వారు నమ్మలేదు.సందీప్ అమ్మగారు నన్ను చూసి అచ్చం సందీప్ లానే ఉన్నావు అన్నారు. సందీప్ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు అడవి శేష్. సందీప్ గారు ఐకానిక్ ఫోటో కోసం నవ్వు ఆపుకుంటూ పాస్ పోర్ట్ ఫోటో దిగారట. ఆయన కళ్ళల్లో ఆ స్పిరిట్ నన్ను ఇన్స్పెర్ చేసింది. ఎలా గైనా సినిమాతీసి ఆయన జీవితాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నా . ‘చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ’.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు’ అని లుక్ టెస్ట్ కి వెళ్లి మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా’ అంటూ పాస్ పోర్ట్ సైజు ఫోటోని రివీల్ చేశాడు శేష్ .