Sonam Kapoor: ఎక్కడ కనిపించినా ఆ విషయం గురించే అడుగుతున్నారు.. సోనమ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

|

Oct 01, 2023 | 3:37 PM

ఇక 2007లో సవారియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. అనంతరం ఢిల్లీ6, నీరజ్‌, ప్యాడ్‌ మ్యాన్‌తో పాటు మరెన్నో సూపర్ మూవీస్‌తో అనతికాలంలోనే నటిగా అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక నటిగా బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకుందీ బ్యూటీ. 2018లో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న ఈ చిన్నది 2020లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన...

Sonam Kapoor: ఎక్కడ కనిపించినా ఆ విషయం గురించే అడుగుతున్నారు.. సోనమ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Sonam Kapoor
Follow us on

సోనమ్‌ కపూర్‌.. ఈ బ్యూటీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనిల్‌ కపూర్ కూతురిగా, సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. తనదైన అందం, నటనతో బాలీవుడ్ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసింది. స్టార్‌డమ్‌ ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన ముద్ర వేసుకుంది.

ఇక 2007లో సవారియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. అనంతరం ఢిల్లీ6, నీరజ్‌, ప్యాడ్‌ మ్యాన్‌తో పాటు మరెన్నో సూపర్ మూవీస్‌తో అనతికాలంలోనే నటిగా అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక నటిగా బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకుందీ బ్యూటీ. 2018లో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న ఈ చిన్నది 2020లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన లేటెస్ట్‌ మూవీపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు సోనమ్‌. సుమారు మూడేళ్లు గడుస్తోన్న ఇప్పటికీ నెక్ట్స్‌ మూవీ ఎంటన్నది ప్రకటించకపోవడం గమనార్హం.

దీంతో సోనమ్‌ కపూర్ సినిమాలకు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టిందన్న వార్తలు గుప్పుమన్నాయి. సోనమ్‌ కెరీర్ క్లోజ్‌ అయ్యిందని, అందుకే సినిమాలు ప్రకటించడం లేదంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో ఈ వార్తలు జోరుగా సాగడంతో చివరికి సోనమ్‌ స్పందించాల్సి వచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చిందీ బ్యూటీ. ఈ ఏడాది ఒకే ఒక సినిమా బ్లైండ్‌లో నటించిన సోనమ్‌.. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా సోనమ్‌ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సినిమాలకు దూరంగా ఉండలేదు. నా బిడ్డ, కుటుంబంతో గడపడానికి జస్ట్‌ చిన్న బ్రేక్‌ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం మెదలు పెట్టానని తెలిపిన సోనమ్‌.. 36 ఏళ్లకు విరామం దొరికిందని తెలిపింది. ఎక్కడ కనిపించినా రీ ఎంట్రీ గురించే అడిగేవారు. సన్నిహితులు, స్నేహితులు చాలా మిస్‌ అవుతున్నామని చెబుతుండే వారు. నిజంగా నాపై ఇంత ప్రేమ చూపినిందుకు ఆనందంగా ఉందని తెలిపింది. ‘నా కుటుంబంతో మరిచిపోలేని క్షణాలు గడిపిన్పటికీ అభిమానుల ప్రేమను మిస్‌ అయినందుకు బాధగానే ఫీల్‌ అయ్యాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సోనమ్‌ కపూర్ బ్యాటిల్‌ ఫర్‌ బిట్టోరాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

17 ఏళ్ల వయసులోనే నటిగా నా ప్రయాణం మొదలవగా 36 ఏళ్లకు రెస్ట్ దొరికింది. ఎక్కడ కనిపించిన రీ ఎంట్రీ ఎప్పుడంటూ అందరూ అడిగేవారు. ఫ్రెండ్స్, సన్నిహితులు నన్ను చాలా మిస్ అవుతున్నామని మెసేజ్‌లు పెట్టేవారు. నిజంగా నాపై ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా అనిపించింది. నా కుటుంబంతో మరిచిపోలేని క్షణాలు గడిపినప్పటికీ అభిమానుల ప్రేమను మిస్ అయినందుకు బాధగానే ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా ‘బ్యాటిల్ ఫర్ బిట్టోరా’తో త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలిపింది సోనమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..