
రష్మిక మందన్న.. ఇప్పుడీ పేరు నేషనల్ వైడ్‌గా సెన్సేషన్. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. పుష్ప చిత్రంతో శ్రీవల్లి పాత్రలో నటించిన ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఓవర్‌నైట్‌లో నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లో సైతం ఈ అమ్మడుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ చిన్నది బాలీవుడ్ మూవీ ‘గుడ్‌బై’ సినిమా ప్రమోషన్స్‌లో ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధంచిన వివరాలను వెల్లడించింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాలో లిప్‌లాక్ సీన్‌కు సంబంధించి తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ రోజుల్లో తనపై వచ్చిన ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో తెలియట్లేదని వాపోయింది. తాను చాలా సున్నిత మనస్కురాలిని అని చెప్పిన రష్మిక.. ఆ సీన్ గురించి కొంతమంది తనకు ఫోన్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేవాళ్లని. కానీ, మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చింది.
రష్మిక ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నన్ను బాధించే సంఘటనలు చాలా జరిగాయి. రాత్రి పడుకున్నప్పుడు నేను ఎవరినో వేడుకుంటున్నట్లు కలలు వచ్చేవి. అందరూ నన్ను వెలివేసినట్లు కూడా కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. అలా రాత్రంత్రా ఏడుస్తూ ఉండేదాన్ని’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..