Ragini : 13 ఏళ్లకే పెళ్లి.. 570కి పైగా సీరియల్స్.. 190కి పైగా సినిమాలు.. సీరియల్ నటి రాగిణి జీవితంలో ఇన్ని కష్టాలా?

తెలుగు బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి రాగిణి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం , ఎదుర్కొన్న సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు 35 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె ఇప్పటివరకు 570కి పైగా సీరియల్స్, 180కి పైగా సినిమాల్లో నటించారు.

Ragini : 13 ఏళ్లకే పెళ్లి.. 570కి పైగా సీరియల్స్.. 190కి పైగా సినిమాలు.. సీరియల్ నటి రాగిణి జీవితంలో ఇన్ని కష్టాలా?
Ragini

Updated on: Oct 06, 2026 | 11:55 AM

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో రాగిణి ఒకరు. పలు సీరియల్స్, సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన రాగిణి.. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇంటర్వ్యూలో రాగిణి మాట్లాడుతు, తన జీవిత ప్రయాణంలో ఎదురైన కష్టసుఖాలను గుర్తు చేసుకున్నారు. సీరియల్ రంగానికి వచ్చిన ప్రారంభ రోజుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, అయితే ఆ సమయంలో తన భర్త ఇచ్చిన ప్రోత్సాహం, కొండంత అండగా నిలిచిన తీరు ఎన్నటికీ మరచిపోలేనని తెలిపారు. “జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, నా వెంటే ఉండి నన్ను నడిపించింది నా భర్తే” అని చెప్తున్న సమయంలో ఆమె కళ్ల వెంట నీళ్లు తిరిగాయి.

రాగిణి మాట్లాడుతూ, తనది పెద్ద కుటుంబమని, మొత్తం 13 మంది సంతానంలో తాను 12వ వ్యక్తిని అని తెలిపారు. తనకు 12 ఏళ్లు నిండగానే, 13వ ఏటనే తమ ఇంట్లో పెళ్లి చేసేశారని పేర్కొన్నారు. 14వ ఏట కొడుకు పుట్టాడని వెల్లడించారు. ఆ తర్వాత భర్త ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పారు. దాంతో చిన్న వయసులోనే పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని, అమ్మను, పసిపిల్లాడిని పోషించే బాధ్యత ఆమెపై పడింది. ఈ అనుభవమే తాను జీవితంలో మళ్లీ వివాహం చేసుకోకపోవడానికి ప్రధాన కారణమని పరోక్షంగా తెలియజేశారు. ఈ విషయంపై మరింత స్పష్టతను ఆమె ఇంటర్వ్యూలో అందించారు. అలాగే, సినీ పరిశ్రమలో తనకు ఎవరైనా క్రష్ ఉన్నారా అనే ప్రశ్నకు, అలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవని రాగిణి స్పష్టం చేశారు. చిన్నతనం నుండి పెద్ద కుటుంబం, పెళ్లి వంటి విషయాలతోనే తన జీవితం గడిచిందని ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది. కన్నడ భాషపై పట్టు గురించి అడిగినప్పుడు, కొద్దిగా మాత్రమే మాట్లాడగలనని సమాధానమిచ్చారు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రారంభంలో ఒక రోజు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ₹500 వచ్చేవని, ఎన్నో కష్టాలు అనుభవించి కుటుంబ భారమంతా తనే మోశానని చెప్పారు. అంతేకాకుండా తన అక్క పిల్లల బాధ్యతను కూడా తీసుకుని వారిని ఉన్నత చదువులు చదివించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా సెటిల్ చేశానని గర్వంగా తెలిపారు. తాను చదువుకోకపోయినా, పట్టుదలతో కష్టపడి సొంత ఇల్లు, కారు కొనుక్కునే స్థాయికి ఎదిగానని ఆనందం వ్యక్తం చేశారు. నేటి తరం నటీనటులకు రాగిణి పలు సూచనలు చేశారు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు మాట్లాడే తీరు, ప్రవర్తన బాగుంటే ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఎదుటివారికి గౌరవం ఇస్తేనే మనకు గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Loading...
Unable to load recommendations.
Follow Us