Payal Ghosh: ఆ సమయంలో, గంభీర్‌ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు

|

Dec 01, 2023 | 6:40 PM

ఈ నేపథ్యంలో తాజాగా వరుస ట్వీట్స్‌ చేస్తూ మరో సారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిందీ బ్యూటీ. ఇర్పాన్‌ పఠాన్‌తో విడిపోయిన తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని ట్వీట్ చేసింది పాయల్‌. బ్రేకప్‌ తర్వాత ఏళ్ల తరబడి పని చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ఇర్ఫాన్‌ పఠాన్‌తో గతంలో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్‌ను రాసుకొచ్చింది. ఇక తాను ప్రేమించిన వ్యక్తి ఒక్కడేనని, ఆ తర్వాత తాను ఎవరినీ ప్రేమించలేదని...

Payal Ghosh: ఆ సమయంలో, గంభీర్‌ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చేవాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
Payal Ghosh
Follow us on

నటి పాయల్‌ ఘోష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రయాణం, ఊసరవెళ్లి వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుందీ బ్యూటీ. ముఖ్యంగా టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ప్రేమాయణానికి సంబంధించి పాయల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా వరుస ట్వీట్స్‌ చేస్తూ మరో సారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిందీ బ్యూటీ. ఇర్పాన్‌ పఠాన్‌తో విడిపోయిన తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని ట్వీట్ చేసింది పాయల్‌. బ్రేకప్‌ తర్వాత ఏళ్ల తరబడి పని చేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. ఇర్ఫాన్‌ పఠాన్‌తో గతంలో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్‌ను రాసుకొచ్చింది. ఇక తాను ప్రేమించిన వ్యక్తి ఒక్కడేనని, ఆ తర్వాత తాను ఎవరినీ ప్రేమించలేదని పేర్కొందీ బ్యూటీ.

ఇక మరో ట్వీట్‌లో టీమిండియా మాజీ ప్లేయర్‌ గౌతం గంభీర్‌ను సైతం పాయల్ టార్గెట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో.. పఠాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు గంభీర్‌ తనకు తరచుగా మిస్‌కాల్ ఇచ్చేవాడని రాసుకొచ్చింది. ఇర్ఫాన్‌కి ఇది బాగా తెలుసున్న పాయల్‌ ఘోష్‌, అతను తన కాల్స్‌ అన్ని చేసేవాడని పేర్కొంది. ఇక తాను పుణేలో ఇర్ఫాన్‌ని కలవడానికి వెళ్లినప్పుడు తన ముందు యూసుఫ్‌, హార్ధిక్‌, కృనాల్‌ను కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే నవంబర్‌లో ఓ ట్వీట్‌తో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నవంబర్‌ 2వ తేదీన ట్వీట్ చేసిన పాయల్ ఘోష్‌.. మహ్మద్‌ షమీని ప్రపోజ్‌ చేసింది. 2వ తేదీన శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు తీశాడు, ఆ తర్వాత నటి ట్వీట్ చేసి.. ‘షమీ మీ ఇంగ్లిష్‌ను మెరుగుపరుచుకోండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ ట్వీట్ తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..