ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార మృణాల్ ఠాకూర్. తొలి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది ఎక్కడలేని క్రేజ్‌ను దక్కించుకుంది. సీత పాత్రలో ఒదిగిపోయి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే సీతారామం విడుదలై దాదాపు ఏడాది దగ్గరపడుతోన్న ఈ బ్యూటీ నటించిన మరో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకురాలేదు. పలు హిందీ చిత్రాల్లో తళుక్కుమన్నా తెలుగులో మాత్రం కనిపించలేదు.
ఇదిలా ఉంటే సీతారామం తర్వాత తన మూవీ ఆలస్యం కావడానికి గల అసలు కారణాన్ని తెలిపింది మృణాల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సీతా రామం’లో నటించడం తనకు ఓ గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పుకొచ్చిన మృణాల్.. ‘తర్వాత నేను పెద్ద దర్శకనిర్మాతలను కలిసి వారితో పనిచేయాలని ఉందని అడిగినప్పుడు ‘మృణాల్ మీకోసం మంచి పాత్రను సిద్ధం చేస్తాం. ‘సీతా రామం’లో పాత్ర కంటే గొప్పగా ఉండేలా రాయలంటే కొంచెం సమయం పడుతుంది’ అని చెప్పుకొచ్చింది. సీతా రామం తర్వాత మరో సినిమా ఓకే చేయడానికి అందుకే ఆరు నెలలు పట్టిందని మృణాల్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాని 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ను ఇప్పటి వరకు చదవలేదని చెప్పింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభమం కానుంది.
ఇక మృణాల్ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం పలు హిందీ మూవీలస్‌లో నటిస్తోంది. వీటిలో ‘గుమరాహ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదిత్య రాయ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మృణాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..