దావూద్‌ ఇబ్రహీం మంచివాడు.. టెర్రరిస్ట్‌ కాదు.. వివాదంలో మమతా కులకర్ణి..!

దావూద్‌ ఇబ్రహీం మంచివాడు.. టెర్రరిస్ట్‌ కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మమతా కులకర్ణి. ముంబై పేలుళ్లతో దావూద్‌కు సంబంధం లేదన్నారు. దావూద్‌కు మమత క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. మమత వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది.

దావూద్‌ ఇబ్రహీం మంచివాడు.. టెర్రరిస్ట్‌ కాదు.. వివాదంలో మమతా కులకర్ణి..!
Actress Mamta Kulkarni

Updated on: Oct 30, 2025 | 9:38 PM

సన్యాసినిగా మారిన బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌గా ఉన్న దావూద్‌ ఇబ్రహీం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దావూద్‌ ఇబ్రహీం చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అంతేకాదు దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్‌ కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో దావూద్‌కు సంబంధం లేదన్నారు. దావూద్‌కు మమత క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి.

అయితే తనకు దావూద్‌ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు మమతా కులకర్ణి. జీవితంలో ఎప్పుడు అతడితో కలవలేదన్నారు. డిగ్యాంగ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన విక్కీ ‌ గోస్వామితో గతంలో మమతకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డ్రగ్స్‌ వ్యాపారంలో ఇద్దరికి భాగస్వామ్యం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మమత తోసిపుచ్చారు. విక్కీ గోస్వామితో పెళ్లి కాలేదన్నారు. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా సందర్భంగా హల్‌చల్‌ చేశారు మమతా కులకర్ణి.

మొత్తానికి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు మమతా కులకర్ణి. దావూద్‌ ఇబ్రహీం మంచి వ్యక్తి అని ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై హిందూ సంఘాలు మండిపడుతున్నారు. 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఆమె మమతా కులకర్ణి. బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత మమత భారత్‌కు తిరిగి వచ్చింది.. డ్రగ్స్‌ కేసు నుంచి అతికష్టం మీద బయటపడింది. తరువాత సన్యాసం స్వీకరించి దేశమంతా హాట్‌టాపిక్‌గా మారింది.

వీడియో చూడండి.. 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..