Tollywood : భర్తతో విడాకులు.. ఆ హీరోతో లవ్ బ్రేకప్.. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో 19 ఏళ్ల చిన్నోడితో రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్..

ప్రస్తుతం సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికే భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకంటే పన్నెండేళ్ల చిన్నవాడితో ప్రేమాయణం నడిపింది. ఇక అతడితో బ్రేకప్ జరగ్గా.. రెండో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tollywood : భర్తతో విడాకులు.. ఆ హీరోతో లవ్ బ్రేకప్.. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో 19 ఏళ్ల చిన్నోడితో రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్..
Malaika Arora

Updated on: Aug 28, 2026 | 7:31 AM

ప్రస్తుతం సినీరంగంలో వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తుంది బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా. కొంతకాలంగా మలైకా వజ్రాల వ్యాపారవేత్త హర్ష్ మెహతాల సంబంధం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు, వారిద్దరూ ఒక ప్రత్యేక సందర్భంలో కలిసి కనిపించడంతో, వారి సంబంధం గురించిన చర్చ మళ్లీ ఊపందుకుంది. ఆగస్టు 26న, మలైకా తన తల్లి ఇంట్లో హర్ష్ మెహతాతో కలిసి ఓనం పండుగను జరుపుకున్నారు. ఈసారి మలైకా ఇంట్లో హర్ష్ ఉండటాన్ని చూసి, వారి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 52 ఏళ్ల వయసులో మలైకా మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓనం పండుగ సందర్భంగా హర్ష్ మెహతా మలైకా తల్లి ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

అయితే మలైకా, హర్ష్ కలిసి కనిపించడం ఇది మొదటిసారి కాదు. వీరిద్దరూ గతంలోనూ పలుచోట్ల కలిసి కనిపించారు. అందువల్ల, గత కొన్ని నెలలుగా వారి సంబంధంపై నిరంతరం చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో రాజస్థాన్‌లోని ఒక గుడిలో మలైకా హర్ష్‌తో కలిసి కనిపించింది. ఓనం పండుగను జరుపుకోవడానికి హర్ష్ మలైకా తల్లి గారి ఇంటికి వెళ్ళాడని వెల్లడైన తర్వాత, నెటిజన్లు వెంటనే వారి పెళ్లి గురించి చర్చించడం మొదలుపెట్టారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, మలైకా అరోరా గానీ, హర్ష్ మెహతా గానీ తమ పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

మలైకా, హర్ష్‌ల మధ్య సుమారు 17 నుంచి 19 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. మలైకా గతంలో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 1998లో వివాహం చేసుకుని, 2017లో విడాకులు తీసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మలైకా హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు సాగిన వీరి ప్రేమకథ చివరకు బ్రేకప్ తో ముగిసింది. ఇక తర్వాత మలైకా హర్ష్ తో కలిసి కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ మొదలైంది. మలైకా, హర్ష్‌లు తమ సంబంధాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై గానీ, లేదా వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారా అనే దానిపై గానీ ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు.

మలైకా ఫోటో..

Malaika Arora., Harsh Mehta

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

మలైకా ఆరోరా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us