Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు సైతం సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదు. తాజాగా సినీ నటి లావణ్య త్రిపాఠి సైతం సోషల్ మీడియాలో వేధింపులకు గురైనట్టు తెలిపారు. ఈ విషయంపై ఆమె హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి అసభ్యకర మెసెజ్‌లు, కామెంట్స్ వుస్తున్నట్టు ఆమె కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు
Lavanya Tripathi Cyber Harassment

Edited By:

Updated on: Mar 10, 2026 | 1:15 PM

సోషల్‌ మీడియా యాప్ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తమ పరువుకు భంగం కలిగించే విధంగా కొందరు అసభ్యకర మెసెజ్‌లు చేస్తున్నారని.. వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సినీ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఘటనపై సెక్షన్‌ 67తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు ప్రకారం.. పర్పుల్‌ క్రెయాన్‌ అనే ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ నుంచి తనకు వ్యక్తిగత దూషణలు, అసభ్యకర కామెంట్స్ వస్తున్నాయని.. ఇవి తమ పరువును భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ అకౌంట్ నుంచి కావాలనే తనను తన ఫ్యామిలీ టార్గెట్‌గా మెసేజెస్, కామెంట్స్ చేస్తున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కన్నారు. గత కొన్ని రోజులుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.

తన గౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని పోస్ట్‌లకు కామెంట్స్ పెడుతున్నారని.. తన వ్యక్తిత్వాన్ని , నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తూ ఇన్‌స్టా అకౌంట్‌ను రన్ చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ అకౌంట్ నుంచి ఇప్పటి వరకు చేసిన పోస్ట్‌లు, మెసేజ్‌లు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us