Actress Keerthi Suresh: రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన సావిత్రి అంటేనే కీర్తి అనేలా నటించి అందరి ప్రశంసలు పొందింది కీర్తి. ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. తాజాగా కీర్తి సురేష్ మరో అరుదైన ఘనత సాధించింది.
ప్రతి సంవత్సరం ప్రకటించే ఫోర్బ్స్ జాబితాలో కీర్తి సురేష్ చోటు దక్కించుకుంది. 2020 ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ఎంటర్ టైన్మెంట్ విభాగంలో ’30 అండర్ 30′ జాబితాలో కీర్తి సురేష్ 28వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక కీర్తితోపాటు బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి 26వ స్థానంలో నిలిచింది. కీర్తి సురేష్ కేరళ అమ్మాయి. మొదటగా బాలనటిగా కెరీర్ ఆరంభించిన.. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేసింది. 2013లో మలయాళ మూవీ గీతాంజలిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తెలుగులో నేను శైలజ మూవీ చేసింది. ప్రస్తుతం కీర్తి యంగ్ హీరో నితిన్ సరసన ‘రంగ్ దే’ మూవీలో.. అటు మహేష్ బాబుతో జోడిగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది.
Also Read:
2021 ఆస్కార్ బరిలో నిలిచిన బాలీవుడ్ లఘు చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన ‘నట్కాట్’