నటి హేమ.. డ్రగ్స్ వాడకంలో హేమా-హేమీనే. అబద్దాలు చెప్పడంలోనూ దిట్టగానే కనిపిస్తున్నారు. అసలు రేవ్ పార్టీకి మీనింగ్ ఏంటని సెర్చ్ చేస్తే జుగుప్సా కరమైన అర్ధాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పార్టీకి అటెండ్ అవ్వడమే కాదు.. అందులో డ్రగ్స్ తీసుకోవడం విచ్చలవిడిగా ఎగరడం.. అత్యంత హేయం. ఈవెంట్‌కి 73మంది పురుషులు 30 మంది అమ్మాయిలు హాజరయ్యారు. వారిలో హేమ కూడా ఉన్నారు. అందరికీ డ్రగ్ టెస్టులు చేస్తే 86 మందికి పాజిటివ్ రావడం షాకింగే.
వాసు బర్త్‌డే పార్టీ పేరుతో ఈ మిడ్‌నైట్ ఈవెంట్ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించారు. హేమ అండ్ బ్యాచ్ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. హేమ 18వ తేదీనే బెంగళూరుకు వెళ్లినట్లు ఫ్లైట్ డీటెయిల్స్ ఉన్నాయి. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవార్లు జరిగేటట్లు ప్లాన్ చేశారు. కాని పోలీసులు మిడ్‌నైటే వారి ఆనందానికి బ్రేకులు వేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రెయిడ్స్ నిర్వహించారు. నటి హేమతోపాటు.. వంద మందిని బుక్ చేశారు.
బెంగళూరు పోలీసులు మాత్రం ఈ పార్టీని అంత ఈజీగా వదిలేటట్లు కనబడడం లేదు. ఈ పార్టీలో ఏమేం కార్యకలాపాలు జరిగాయో తెలుసుకుంటున్నారు. డ్రగ్సేనా ఇంకా ఏమైనా జరిగి ఉంటాయా అనేది వారి అనుమానం. క్రికెట్ బుకీలు కూడా హాజరయ్యారు కాబట్టి.. దీని వెనుక బెట్టింగ్ మాఫియా సైతం ఉండే అవకాశాలు లేకపోలేదు. నిందితుడు ఎల్ వాసు విజయవాడ వాసి. పేదరికం నుంచి.. కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎదిగాడు. నటి హేమ, ఆషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ గా రిపోర్టుల్లో తేలింది.
రేవ్‌పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును బెంగళూరు నగర కోర్టులో హాజరు పరచారు. అనంతరం పరప్పన అగ్రహార సెంట్రల్ ప్రిజన్‌కు వారిని తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినట్లు సీపీ చెబుతున్నారు. అక్కడ డ్రగ్స్ అమ్మకాలు, క్రికెట్ బెట్టింగులు జరిగాయన్నదానిపై క్లారిటీ వస్తోంది. అంతేకాకుండా ఇంకో డార్క్ యాంగిల్ కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ బయటకు వస్తే పార్టీకి హాజరైన వారిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి.
నటి హేమ మాత్రం ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆరోజు పార్టీకి హాజరై పోలీసులకు చిక్కినా.. తాను అక్కడ లేనని ఓ వీడియో చేసి మీడియాకు విడుదల చేశారు. ఇంకోవైపు తన పేరు బయటకు రాకుండా బెంగళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో.. కేసులో కృష్ణవేణిగానే రాసుకున్నారు. ఓవైపు ఇది జరుగుతుండగానే.. ఇంకోవైపు తన ఫ్యామిలీతో ఫోన్‌లో మాట్లాడాలని చెప్పి పక్కకు వచ్చి.. తాను డ్రగ్స్ కేసులో లేనని.. అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆమె ఆ వీడియోలో వేసుకున్న డ్రెస్.. ఆతర్వాత బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫొటోలోని డ్రెస్ సేమ్. అక్కడితో హేమ డ్రామా ఆగలేదు. తర్వాతి రోజు బిర్యానీ వండుతున్నట్లు ఓ వీడియోని రిలీజ్ చేయడం ఇంకా దారుణం. ప్రస్తుతం స్టేషన్ బెయిల్‌పై నటి హేమ బయటకు వచ్చేశారు. కాని ఎప్పుడు పిలిచినా రావలన్న కండిషన్ అందులో ఉంది. త్వరలోనే బెంగళూరు పోలీసులు ఆమెను విచారించే అవకాశాలున్నాయి.
వాసు అన్న బర్త్‌డే అంటే వెళ్లాను.. అక్కడ కేవలం కూల్ డ్రింకే తాగాను అంటూ చెప్పుకొచ్చిన నటి అషీరాయ్ కూడా దొరికిపోయారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు కూడా పాజిటివ్ వచ్చింది. కొకెయిన్ తోపాటు.. హైడ్రోగాంజా ఆనవాళ్లు ఆ పార్టీకి వచ్చిన అతిథుల బ్లడ్‌లో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి.. మళ్లీ తెల్లవారుజాము 6 గంటల వరకు ఏమాత్రం తగ్గకుండా డ్యాన్సులు చేయడం.. ఇతరత్రా కార్యక్రమాలకు ఎనర్జీని క్యారీ చేయడానికి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..