actress Hema : అలాంటి పాత్రలు దర్శకులు తనకు ఇవ్వడంలేదని కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ…

|

Jan 31, 2021 | 1:44 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. హేమ ఇప్పటికే అనేక క్యారెక్టర్స్ చేసింది కానీ తల్లి పాత్రలు మాత్రం ఎక్కువ దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు...

actress Hema : అలాంటి పాత్రలు దర్శకులు తనకు ఇవ్వడంలేదని కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ...
Follow us on

actress Hema :  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. హేమ ఇప్పటికే అనేక క్యారెక్టర్స్ నటించి మెప్పించింది. కానీ అమ్మ పాత్రలు మాత్రం ఎక్కువ దక్కలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. యాకర్ ప్రదీప్ నటించిన “30 రోజుల్లో ప్రేమించండం ఎలా.?” అనే సినిమాలో హేమ తల్లిపాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు దక్కింది. ఇటీవల సక్సెస్ మీట్ లో హేమ మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ మంచి పాత్రను తనకు ఇచ్చిన చిత్రదర్శకుడికి నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నంది అవార్డులు వచ్చిన సమయంలో కూడా నాకు కళ్ల వెంట నీళ్లు రాలేదు. చాలా ఏళ్లుగా ఇలాంటి తల్లి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను. సుకుమార్ గారిని ఎప్పటి నుంచో బ్రతిమిలాడుతుంటే ‘కుమారి 21 ఎఫ్’లో తల్లిపాత్ర దక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఎందుకో దర్శకులు నాకు అమ్మ పాత్ర ఇవ్వడం లేదని ఆమె అన్నారు. అమ్మ పాత్రలు అంటే ఎంతో ఇష్టపడే తనకు అలాంటి పాత్రలు ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక ముందైనా అమ్మ పాత్రలు దక్కుతాయని ఆశిస్తున్నట్టు హేమ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన స్టార్ కమెడియన్.. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రీమేక్‏లో హీరోగా …