AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవితో పోటీ పడి మరి డ్యాన్స్ చేసేదాన్ని.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..

చిరంజీవితో డాన్స్‌లో కనిపించిన పోటీతత్వంపై టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కూచిపూడి నేపథ్యం నుంచి వచ్చి, సాంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాపుగారితో పని చేయలేకపోవడం పట్ల విచారం, కె.విశ్వనాథ్ గారితో స్వర్ణకమలం అనుభవాలను వివరించారు. ఆమె కెరీర్ హైలైట్స్, వ్యక్తిగత ఆసక్తులు గురించి చెప్పుకొచ్చారు.

Megastar Chiranjeevi: చిరంజీవితో పోటీ పడి మరి డ్యాన్స్ చేసేదాన్ని.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2026 | 4:43 PM

Share

ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాలు, చిత్రసీమలోని అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నృత్యం చేయడం, తనలో కనిపించిన పోటీతత్వం, అలాగే తన దుస్తుల ఎంపిక, దర్శకుడు బాపుగారితో పని చేయలేకపోవడం వంటి విషయాలపై ఆమె వివరణ ఇచ్చారు. చిరంజీవి క్లాసికల్ డాన్సులతో పాటు ర్యాప్, ట్యాప్, డిస్కో వంటి పాటలను ఎంతో అద్భుతంగా, ఈజ్‌తో చేశారని భానుప్రియ ప్రశంసించారు. ఆయనతో డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన అనుభూతి కలిగేదని, “సం టైమ్స్ కొంచెం ఓవర్ చేసేస్తున్నానేమో అనిపిస్తుంది. అంత లైక్ సో మచ్ లైఫ్ ఇన్ ఇట్ వెన్ ఐ యామ్ డాన్సింగ్ విత్ హిమ్,” అని ఆమె అన్నారు. అయితే చిరంజీవి తనను రాధిక, రాధ, భానుప్రియలను బెస్ట్ డాన్స్ పెయిర్‌గా భావించినప్పటికీ, భానుప్రియ ఒక కో-స్టార్‌తో కాకుండా ఒక కాంపిటీటర్‌తో డాన్స్ చేస్తున్నట్లు ఫీల్ అవుతారని చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

దీనిపై భానుప్రియ స్పందిస్తూ, అది కేవలం పర్ఫెక్షన్ కోసం, బాగా చేయాలనే తపన అని, చిరంజీవి కంటే బాగా చేయాలనే ఆలోచన కాదని అన్నారు. తన కూచిపూడి మాస్టర్ నేర్పిన కఠినమైన క్రమశిక్షణే తనలో ఈ తపనకు కారణమని ఆమె వివరించారు. డాన్స్ టెక్నికాలిటీస్‌పై భానుప్రియ ప్రత్యేక దృష్టి సారించేవారని, ఫుట్ మూవ్‌మెంట్స్, చేతులు, వేళ్ళ కదలికలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకునేవారని తెలిపారు. వెస్ట్రన్ డాన్స్ స్టైల్స్, డిస్కో పాటలు చేయడం ఒక సరదా అనుభవమని, “అమెరికా అల్లుడు” వంటి సినిమాలలో ఈ అవకాశం లభించిందని చెప్పారు. ఇది తాను నేర్చుకున్న కూచిపూడికి పూర్తి భిన్నమైన శైలి అయినప్పటికీ, వాటిని ఎంజాయ్ చేశానని అన్నారు.

దర్శకుడు బాపుగారితో పని చేయలేకపోవడం పట్ల భానుప్రియ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాపుగారు ఒక గొప్ప కళాత్మక దర్శకుడని, ఆయన చిత్రాలు, ముఖ్యంగా ముత్యాల ముగ్గులోని సంగీత గారి పాట తనకు చాలా ఇష్టమని చెప్పారు. బాపుగారు అందమైన కళ్ళను వెతుకుతారని విన్నానని, తనకు అవకాశం వస్తుందేమోనని ఎదురుచూశానని, కానీ అది నెరవేరలేదని ఆమె ఆవేదన చెందారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

చిరంజీవి, భాను ప్రియ ..

Chiranjeevi, Bhanu Priya

Chiranjeevi, Bhanu Priya

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us