Kayal Anandhi Marriage : తెలుగులో పలు సినిమాల్లో మెప్పించిన హీరోయిన్ ఆనంది. ఈ అమ్మడు ఆతర్వాత కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జాంబిరెడ్డి’ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. ఇటు తెలుగులో అటు తమిళంలోనూ నటిస్తున్న ఆనంది సడన్ గా పెళ్లిచేసుకుంది. వరంగల్ లో ఈ హీరోయిన్ పెళ్లి సీక్రెట్ గా జరిగింది. సోక్రటీస్ అనే వ్యక్తిని ఆనంది వివాహమాడారు. వరంగల్‌లోని ఓ హోటల్‌లో పరిమితంగా హాజరైన స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సోక్రటీస్, ఆనందిల వివాహం జరిగింది. ఈ వివాహానికి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఆనంది ఇంత సైలెంట్ గా ఎందుకు పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. పైగా ఇది పెద్దలు కుదురిచ్చిన వివాహమేనట..
మరిన్ని ఇక్కడ చదవండి :
Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’..?
Mirchi Villain About His Divorce: ఆ నటితో పెళ్లి, విడాకుల గురించి సీక్రెట్ చెప్పిన మిర్చి విలన్