KGF-2 Movie Rights: కేజీఎఫ్-2 సినిమా హక్కులను సొంతం చేసుకున్న హీరో కమ్ చిత్రనిర్మాత.. ఎవరంటే ?

|

Jan 06, 2021 | 4:08 PM

సరికొత్త యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన్న కేజీఎఫ్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురింపించింది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలయిన

KGF-2 Movie Rights: కేజీఎఫ్-2 సినిమా హక్కులను సొంతం చేసుకున్న హీరో కమ్ చిత్రనిర్మాత.. ఎవరంటే ?
Follow us on

సరికొత్త యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన్న కేజీఎఫ్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురింపించింది. అంతే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదలన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం దానికి సిక్వెల్‏గా కేజీఎఫ్-2 చిత్రం రూపొందుతోంది. కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్‍గా గుర్తింపు పొందాడు ప్రశాంత్ నీల్. భారీ యాక్షన్ సినిమాపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి సంబంధించిన కేరళ హక్కులను మలయాళ హీరో కమ్ చిత్ర నిర్మాత పృథ్వీ రాజ్ భారీ మొత్తంతో కొనుగోలు చేశారట. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ తన ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. అందులో “నేను కేజీఎఫ్ సిరీస్‏కు పెద్ద అభిమానిని. లుసీఫర్ తర్వాత నన్ను సంప్రదించిన సంస్థ హంబలే ఫిల్మ్స్ మొదటిది. నేను కేజీఎఫ్ -2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎదురుచూసే కేజీఎఫ్ -2 మూవీ రైట్స్‏ను చాలా గర్వంగా ఉంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కేజీఎఫ్-2ను హక్కులను తీసుకోవడం చాలా గర్వంగా ఉంది.. నేను కూడా రాకీభాయ్‏ను చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.

పృథ్వీరాజ్ ట్వీట్..

Also Read:

Salman Khan: భారీ బడ్జెట్‏తో సల్మాన్ ఖాన్ రాధే మూవీ హక్కులను సొంతం చేసుకున్న జీ స్టూడియోస్..