Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో హీరో గా పరిచయమైన నవీన్ చంద్ర. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సూపర్ ఓవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు ఈ యంగ్ హీరో.. సర్వoత్ రామ్ క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమా గురువారం (జనవరి 28) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మూవీ స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు అందచేశారు. రాశి మూవీస్ అధినేత నరసింహారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘అరవింద్ చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు. మధుబాల మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ అరవింద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో డీజీపీగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. చాలా కాలం తరువాత మంచి కథతో తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’’ అన్నారు. ఇదిలా ఉంటే సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘అమ్మకి అమ్మాయికి బైక్‌కి అవినాభావ సంబంధం ఉంది’.. ఆకట్టుకుంటున్న ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ టీజర్