స్టేడియంలో ఇవేం పనులు..? టీవీ యాంకర్ సహా ఐదుగురి అరెస్ట్

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వెళ్లిన.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేసింది. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. పక్కవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఆరుగురు. వారి రచ్చతో గేలరీలో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్‌ను ప్రశాంతంగా చూడలేకపోయారు. ఈ విషయంపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Hyderabad: 6 persons including Telugu TV actor Prashanthi booked for creating nuisance & obstructing […]

స్టేడియంలో ఇవేం పనులు..? టీవీ యాంకర్ సహా ఐదుగురి అరెస్ట్

Edited By:

Updated on: Apr 22, 2019 | 12:30 PM

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వెళ్లిన.. ఓ గ్యాంగ్ నానా హంగామా చేసింది. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. పక్కవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఆరుగురు. వారి రచ్చతో గేలరీలో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్‌ను ప్రశాంతంగా చూడలేకపోయారు. ఈ విషయంపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యువకుడి ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 188, 506ల కింద ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో టీవీ యాంకర్ ప్రశాంతి.. అమీర్‌పేట్‌కు చెందిన కందుకూరి ప్రియ, కందుకూరి పూర్ణిమ, నాగోల్‌కు చెందిన గుర్రం వేణు, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి, మాదాపూర్‌కు చెందిన లక్కపల్లి సురేశ్ ఉన్నారు.