Pradeep Visits Khammam: 30రోజుల్లో ప్రేమించడం ఎలా సక్సెస్ జోష్ లో ఉన్న ప్రదీప్…. ఖమ్మం లో సందడి చేసిన చిత్ర యూనిట్

|

Feb 08, 2021 | 1:55 PM

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. కరోనా సృష్టించిన అల్లకల్లోలంలో కూడా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్...

Pradeep Visits Khammam: 30రోజుల్లో ప్రేమించడం ఎలా సక్సెస్ జోష్ లో ఉన్న ప్రదీప్.... ఖమ్మం లో సందడి చేసిన చిత్ర యూనిట్
Follow us on

Pradeep Visits Khammam: బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. కరోనా సృష్టించిన అల్లకల్లోలంలో కూడా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కాసుల వర్షం కురిపించింది. సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న ప్రదీప్ ఆదివారం సాయంత్రం ఖమ్మంలో సందడి చేశాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రం ప్రదర్శించబడుతున్న తిరుమల థియేటర్‌ కు యాంకర్‌ ప్రదీప్‌ చిత్ర యూనిట్ వెళ్లారు. ప్రదీప్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రదీప్ ప్రేక్షకులతో సరదాగా గడిపారు. సినిమా ఎలా ఉందో తెలుసుకున్నారు. తనను ఆదరిస్తున్న వారందరికీ ప్రదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమా తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చెప్పారు. . ఈ చిత్రాన్ని హిట్‌ చేసిన ప్రేక్షకులను స్వయంగా కలుసుకునేందుకే తమ యూనిట్‌ ఖమ్మంకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు మున్నా, నిర్మాత శ్రీనివాసరావు, థియేటర్‌ మేనేజర్‌ సంగబత్తుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:

‘ఆదిపురుష్’ తర్వాత ఆ యంగ్ హీరోతో సినిమా చేయనున్న ఓంరౌత్.. సన్నాహాలు చేస్తున్న డైరెక్టర్..

తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. ఆశ్చర్యంలో అభిమానులు..