CEC top brass reviews దేశవ్యాప్తంగా కరోనా మహోగ్రరూపం దాల్చుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ శనివారం సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తో మార్గదర్శకాల అమలుపై ఈసీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు పోల్ ప్యానెల్ ప్రతినిధి తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.
294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటివరు ఆరు దశల పోలింగ్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఈ నెల 26న ఏడో విడుత, 29న ఎనిమిది విడుత పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 2న ఫలితాలు వెలువడి కానున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం సభలు, సమావేశాలపై ఈసీ ప్రత్యేక ఆంక్షలు విధించింది.ఇటీవలే ఎన్నికల సంఘం ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బహిరంగ సభలకు హాజరయ్యే జనం సంఖ్యను 500కు పరిమితం చేసింది.
ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కొవిడ్ 19 భద్రతా నిబంధనలు అమలు చేయడంలో ఈసీ తీరుపై కోల్‌కతా హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Election Commission, led by CEC Sushil Chandra & Election Commissioner Rajiv Kumar, today held a meeting with senior officers of West Bengal.@ECISVEEP pic.twitter.com/s8NNs3pPqz
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) April 24, 2021
Read Also… కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు , ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు