ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపు లీక్ చేసిన బీజేపీ.. వాస్తవాలు తెలుసుకోవడం మంచిదన్న వ్యూహకర్త.!

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదే అంశం టీఎంసీ అంతర్గత సర్వేలలో వెల్లడైందన్నారు.

ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపు లీక్ చేసిన బీజేపీ.. వాస్తవాలు తెలుసుకోవడం మంచిదన్న వ్యూహకర్త.!
Prashant Kishor And Amit Malviya

Edited By:

Updated on: Apr 10, 2021 | 9:39 AM

west bengal assembly election 2021: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదే అంశం టీఎంసీ అంతర్గత సర్వేలలో వెల్లడైందన్నారు. క్లబ్ హౌస్ వద్ద బహిరంగ ప్రసంగంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంగీకరించారని అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. అధికార పక్షం టీఎంసికి వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిశోర్ గుర్తించారు. బీజేపీకి దళితులు ఓటు వేస్తున్నారని, తఫ్సిలి, మాతురా కూడా బీజేపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సందేశాన్ని లీక్ చేసింది భారతీయ జనతాపార్టీ. .

తన వీడియో చాట్ లీక్ అవుతుందని ప్రశాంత్ కిషోర్‌కు తెలియదని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్, టీఎంసీల పట్ల.. గత 20 ఏళ్లలో ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. మమతా బెనర్జీ పాలన పట్ల బెంగాల్ వాసులు కోపంగా ఉన్నారని వీడియో చాట్ వల్ల బహిర్గతమైందని అమిత్ మాల్వియా వివరించారు.

ఇదిలావుంటే, ఆడియో లీక్‌పై రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. “నా క్లబ్‌హౌస్ చాట్‌ను బిజెపి తన నాయకుల మాటల కంటే తీవ్రంగా పరిగణిస్తోంది. సంభాషణలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకుని, పూర్తి సంభాషణను విడుదల చేయమని వారిని కోరుతున్నాను” అన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సమానంగా ప్రాచుర్యం అందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.