‘నన్ను హతమార్చడానికి కుట్ర జరిగింది’ , ‘నేను దెబ్బ తిన్న పులిని’, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తనను హతమార్చడానికి నందిగ్రామ్ ర్యాలీలో కుట్ర జరిగిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.  కానీ సాహసంగా తాము పోరాటాన్ని కొనసాగిస్తామని, తనకు ఇంకా నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ..

నన్ను హతమార్చడానికి కుట్ర జరిగింది , నేను దెబ్బ తిన్న పులిని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
I Will Never Bow Down My Head Says Mamata Banerjee

Edited By: Phani CH

Updated on: Mar 14, 2021 | 5:30 PM

తనను హతమార్చడానికి నందిగ్రామ్ ర్యాలీలో కుట్ర జరిగిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.  కానీ సాహసంగా తాము పోరాటాన్ని కొనసాగిస్తామని, తనకు ఇంకా నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ..అంతకన్నా ఎక్కువగా ప్రజలు పడుతున్న నొప్పిని తాను ఫీలవుతున్నానని ఆమె చెప్పారు. (మమతపై దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని ఈసీ స్పష్టం చేసిన విషయం గమనార్హం.ఆమెకు తగిలిన గాయాలు యాక్సిడెంటల్ అని ఈసీ పేర్కొంది).

‘నా  శరీరమంతా గాయాలు తగిలాయి.., అస్వస్థురాలిని..కానీ నా లక్ష్యం మారలేదు..అయినా  వీల్ చైర్ పైనే బెంగాల్ అంతా పర్యటిస్తా.. నేను బెడ్ రెస్ట్ తీసుకుంటే నా రాష్ట్ర ప్రజలకు ఎవరు చేరువవుతారు’ అని ఆమె ప్రశ్నించారు. మన పవిత్ర భూమిని రక్షించేందుకు జరిగే పోరాటంలో మనం ఎంతో నష్టపోయామని, ఇంకా నష్టపోతామని, కానీ పిరికిపందల ముందు తలవంచే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. బెంగాల్ కు వ్యతిరేకంగా జరిగే అన్ని కుట్రలనూ నాశనం చేస్తామని, గాయమైన కాలితోనే వీల్ చైర్ లో ప్రచారం చేస్తానని ఆమె చెప్పారు. ‘గాయపడిన పులి చాలా ప్రమాదకరమైనది’ అని తనను తాను గాయపడిన పులితో పోల్చుకున్నారు. . ఆదివారం ఆమె… కోల్ కతా లోని మేయో రోడ్ నుంచి హజ్రా మోర్ వరకు సెక్యూరిటీ స్టాఫ్ తన వీల్ చైర్ తోస్తుండగా రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా మమతా బెనర్జీ బులెట్ ప్రూఫ్ వాహనం గానీ, సాయుధులతో కూడిన వాహనంగానీ వినియోగించడం లేదని తెలుస్తోంది. మమత బులెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించాలని, కానీ ఆమె అలా చేయలేదని ఈసీ తెలిపింది. ‘ఈమె సెక్యూరిటీ ఇన్-ఛార్జ్ బులెట్ ప్రూఫ్ వాహనంలో ఉన్నారు.. సహాయ్ అనే ఆయనపై చర్య తీసుకోవలసి ఉంది’ అని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజుల క్రితం నందిగ్రామ్ లో మమత గాయపడిన సంగతి తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొంది.. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆమె పాల్గొన్న మొదటి రోడ్ షో ఇది.

మరిన్ని చదవండి ఇక్కడ :  సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat

నలుగురిని చంపి తినేసి పులి..ఆపై పశువులపై దాడి ఆ పులిని కాల్చేయండి..! Tiger Video Viral