బెంగాల్ ఎన్నికలు, పురూలియా జిల్లాలో ఈసీ వాహనం దగ్ధం, మావోలపనేనని అనుమానం

బెంగాల్ ఎన్నికల్లో అప్పుడే మెల్లగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పురూలియా జిల్లాలో ఎన్నికల సిబ్బందిని వారి నియోజకవర్గాల్లో దింపి తిరిగి వెళ్తున్న ఎన్నికల...

బెంగాల్ ఎన్నికలు, పురూలియా జిల్లాలో ఈసీ వాహనం దగ్ధం, మావోలపనేనని అనుమానం
Ec Vehicle Set Ablazed In Purulia District

Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2021 | 1:17 PM

బెంగాల్ ఎన్నికల్లో అప్పుడే మెల్లగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పురూలియా జిల్లాలో ఎన్నికల సిబ్బందిని వారి నియోజకవర్గాల్లో దింపి తిరిగి వెళ్తున్న ఎన్నికల కమిషన్ వాహనాన్ని కొంతమంది అడ్డగించారు. తుల్సీదీ అనే గ్రామం వద్ద వీరు అందులోని డ్రైవర్ ను దింపివేసి ఆ వాహనంపై పెట్రోలుతో నింపిన కాగడాలవంటి వాటిని విసిరివేసి పారిపోయారని  కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమీపంలోని అడవుల నుంచి వీరు వచ్చినట్టు భావిస్తున్నారు. బహుశా వీరంతా మావోయిస్థులని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం  మావోల ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాను’జంగిల్ మహల్’ గా వ్యవహరిస్తుండడమే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.  ఫైర్ సిబ్బంది వచ్చేసరికే ఈసీ వాహనం పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పురూలియా జిల్లాలో మొదటి దశలో తొమ్మిది సీట్లకు పోలింగ్ జరుగుతోంది.

అటు వెస్ట్ మెడిని పూర్ జిలాలో సువెందు అధికారి సోదరుడు, బీజేపీ అభ్యర్థి సౌమెందు  అధికారి వాహనాన్ని కొందరు ధ్వంసం చేశారు.  తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై సౌమెందు అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడే టీఎంసీ కార్యకర్తల దురాగతాలు ఇలా ఉంటే ఇక మునుముందు ఎలా ఉంటాయోనని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన ఈసీ అధికారులను కోరారు. అటు ఈ జిల్లాలో ఈ ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంరంభమైంది. ఎక్కువగా తమ పసికందులతో సహా మహిళలు పోలింగ్ లో పాల్గొన్నారు.కాగా- మధ్యాహ్నానికి ఓటింగ్ పుంజుకోగలదని ఆశిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద  పోలీసులను నియోగించడంతో ప్రశాంతంగా  పోలింగ్ జరుగుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ :బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.
పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.

భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు…!! దీనికి ఆ నౌకే కారణం… ( వీడియో )