మమతా ముఖర్జీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెన్షన్, ఈసీ ఆదేశం, తక్షణమే ఉత్తర్వుల అమలుకు సూచన

| Edited By: Phani CH

Mar 14, 2021 | 8:00 PM

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీ భద్రతా వైఫల్యాలకు కారకుడని ఆరోపిస్తూ ఆమె సెక్యూరిటీ అధికారి వివేక్ సహాయ్ ని ఎలెక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఈ వైఫల్యం వల్లే నందిగ్రామ్ లో ఈనెల 10 న మమత...

మమతా ముఖర్జీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెన్షన్, ఈసీ ఆదేశం, తక్షణమే ఉత్తర్వుల అమలుకు సూచన
ec suspends mamata's chief of security over nandigram injury
Follow us on

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీ భద్రతా వైఫల్యాలకు కారకుడని ఆరోపిస్తూ ఆమె సెక్యూరిటీ అధికారి వివేక్ సహాయ్ ని ఎలెక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఈ వైఫల్యం వల్లే నందిగ్రామ్ లో ఈనెల 10 న మమత గాయపడ్డారని ఈసీ అభిప్రాయపడింది. వివేక్ సహాయ్ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఈసీ సూచించింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన మమతను రక్షించడంలో విఫలమైనందుకు వారం రోజుల్లోగా సహాయ్ పై అభియోగాలను నమోదు చేయాలనికూడా ఈసీ పేర్కొంది. డీజీపీతో సంప్రదించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని. పోస్టింగ్ ఆర్డర్  సోమవారం మధ్యాహ్నానానికల్లా సమర్పించాలని పేర్కొంది.  పూర్బీ మెడిని పూర్ ఎస్ పీ ప్రవీణ్ ప్రకాష్ ని కూడా సస్పెండ్ చేశారు. ఆయనపై కూడా అభియోగాలు మోపాలని ఈసీ ఆదేశించింది. నందిగ్రామ్ లో దీదీ గాయపడిన ఘటనపై 15 రోజుల్లోగా పోలీసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని . ఈ నెల 31 కల్లా నివేదిక సమర్పించాలని ఈసీ అధికారులు కోరారు.

నందిగ్రామ్ లో బెంగాల్ సీఎం గాయపడిన ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరగాలని అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈసీని కోరాయి. తనపై ఐదారుగురు ఎటాక్ కి పాల్పడ్డారని మొదట ఆమె ఆరోపించినప్పటికీ.. అది యాక్సిడెంటల్ అని,  దాడి కాదని ఈసీ స్పష్టం చేసిన విషయం గమనార్హం. అయితే ఆదివారం కోల్ కతా లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె తనను హతమార్చడానికి కుట్ర జరిగిందని చెప్పడం విశేషం.  అయితే అంతకు ముందు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు కూడా ఆమె ఎటాక్ ప్రస్తావన తేలేదు.

మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat