దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఈ ఎనిమిదో విడత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే మీకు వేగంగా.. ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ వివరాలను టీవీ 9 తెలుగు ఛానెల్, టీవీ9 తెలుగు వెబ్‌సైట్ మీ ముందకు తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాధికి సంబంధించి పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలను మినిట్ మినిట్ లైవ్ అప్ డేట్స్ మీకు అందించబోతున్నాం.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే కరోనా సోకి ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు.య ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, శంషర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు మే 16 న ఓటింగ్ జరుగనుంది. బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలు మార్చి 27 న జరిగాయి, రెండవ దశ ఏప్రిల్ 1 న, మూడవ దశ ఏప్రిల్ 6 న, నాలుగవ దశ ఏప్రిల్ 10 న, ఐదవ దశ ఏప్రిల్ 17 న, ఆరవ దశ ఏప్రిల్ 22 న, ఏడో దశ 26న పూర్తవ్వగా.. ఎనిమిదో దశను 29న గురువారం నిర్వహించారు.
అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్ 6న ముగిశాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఇండియా టుడే: బీజేపీ ప్లస్ 75-85
కాంగ్రెస్ ప్లస్ 40-50
టీఎంసీ: 142-152
బీజేపీ: 125-135
కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమి:+- 16-26
బీజేపీ- 143
టీఎంసీ- 133
సీపీఎం- ప్లస్ 16
టిఎంసి: 152-164
బిజెపి +: 109-121
కాంగ్ +: 14-25
ఇతరులు: 0
టీ.ఎమ్.సీ-158
బీజేపీ-115
లెఫ్ట్-19
ఇతరులు -0
బిజెపి – 14%
టిఎంసి – 70%
లెఫ్ట్ – 14.1%
ఇతరులు – 1.9%
బిజెపికి – 49.5
టిఎంసి – 32.4
లెఫ్ట్ – 10
మంది ఇతరులు – 8.1
బిజెపికి – 38.10
టిఎంసి – 45.2
లెఫ్ట్ – 9.9
ఇతరులు – 6.8
బిజెపికి – 42.9 శాతం
టిఎంసి – 42.6
లెఫ్ట్ – 11.5
మంది ఇతరులు – 3
హేమాహేమీల లాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా.. బెంగాల్ ప్రజలు మాత్రం మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే అధిక శాతంలో ఓటేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దీదీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చిందంటూ పేర్కొన్నారు. టీవీ9 ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక మంది అధికార తృణముల్‌కే జై కొట్టారు. వారిలో అత్యధికమంది మహిళలు, ముస్లింలు టీఎంసీ వైపే మొగ్గు చూపారు. టీవీ9 నిర్వహించిన సీ ఓటర్ సర్వేలో 43.90 శాతం మంది టీఎంసీకి ఓటేశామని చెప్పగా.. బీజేపీ 40.50 శాతం, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమికి 10.70శాతం, ఇతరులు 4.90 శాతం అవకాశముందని చెప్పారు.
టీవీ9 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. టీవీ9 సర్వేలో మళ్లీ దీదీ కే పట్టం కట్టేలా ఓటర్లు కనిపించారు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి హేమాహేమీలు ప్రచారం నిర్వహించనప్పటికీ.. బెస్ట్ సీఎం మమతా బెనర్జీనే అంటూ చాలా మంది ఎన్నికలకు ముందే వెల్లడించడం విశేషం.
అస్సాంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 59-69 సీట్లు లభిస్తాయి. అదే సమయంలో కాంగ్రెస్ 55-65 సీట్లు పొందవచ్చు. ఇతరులు 1-3 సీట్లు పొందవచ్చు. ఓటు వాటా స్థితిని దిగువన చూడవచ్చు.
ఎన్డీఏ – 41.7
యుపిఎ – 45.4
ఇతరులు – 12.9 శాతం
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌తో మీరు రాత్రి 7 నుంచి టీవీ9 తెలుగు ఛానెల్, టీవీ9 వెబ్‌సైట్‌లో చూడగలరు. మే 2 న ఏ ఫలితాలు రావచ్చు అనే దానికి సంబంధించిన కచ్చితమైన అంచనా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.