ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏం చేయాలి? ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీఈసీ ఈ అంశంపై ఫోకస్ చేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆరోగ్యశాఖ సమాచారం ఆధారంగా.. ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకుననారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా..? వద్దా..? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధానంగా చర్చించారు. అయితే ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేసుల తీవ్రత, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరు గురించి ఈసీ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే.. ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ అంశాల్లో కోవిడ్-19 ప్రొటోకాల్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి సూచనలు కోరిన ఈసీ. దేశంలో కోవిడ్-19 టీకా పంపిణీ, తాజా పరిస్థితిపై కూడా సమీక్షించింది ఈసీ. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా సాగుతోందని చెప్పిన కేంద్ర ఆరోగ్యశాఖ. ఎన్నికల రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన కోవిడ్-19 ప్రొటోకాల్ గురించి కూడా వివరించింది కేంద్రం.
కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో పాటు పెరుగుతున్న కోవిడ్ కేసులపై దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ స్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఎన్నికల కమిషన్‌కు నివేదికను సమర్పించింది. మంత్రిత్వ శాఖకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఎన్నికల సంఘం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ కేసుల గురించి చర్చించింది. ఐదు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ట్రాన్స్మిసిబిలిటీపై వివరణాత్మక నివేదికను సమర్పించారు.
వచ్చే మూడు నెలల్లో ఒమిక్రాన్ వ్యాప్తి గురించి అడగగా.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆరోగ్య కార్యదర్శి వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫెక్షన్ రేటు ప్రకారం రోజువారీ కోవిడ్ కాసేలోడ్ రాబోయే కొద్ది నెలల్లో 25 శాతం పెరగవచ్చని ఆయన సమావేశంలో చెప్పారు. ఆర్ వాల్యూ పెరిగిన జిల్లాల వివరాలను కూడా ఆరోగ్యశాఖ అధికారులు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి: Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?