Tamilnadu Assembly Elections 2021:తమిళనాట ‘తాయిలాల’ ప్రకటనలు షురూ ! వన్నియార్లపై అన్నాడీఎంకే వరాల వర్షం

| Edited By: Pardhasaradhi Peri

Feb 27, 2021 | 4:04 PM

తమిళనాడు సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును ఈసీ ప్రకటించడడంతో 'తమిళ అసెంబ్లీ'.. అప్పుడే వన్నియార్లపై వరాల వర్షం కురిపించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో..

Tamilnadu Assembly Elections 2021:తమిళనాట తాయిలాల ప్రకటనలు షురూ ! వన్నియార్లపై అన్నాడీఎంకే వరాల వర్షం
Follow us on

Tamilnadu Assembly Elections 2021: తమిళనాడు సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును ఈసీ ప్రకటించడడంతో ‘తమిళ అసెంబ్లీ’.. అప్పుడే వన్నియార్లపై వరాల వర్షం కురిపించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. పైగా పత్తాలి మక్కళ్ కచ్చితో అన్నా డీఎంకె పొత్తును కూడా కుదుర్చుకుంది. ఈ పార్టీలో వన్నియార్ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.  (ఏప్రిల్ 6 న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఫలితాలను ప్రకటిస్తారు). పత్తాలి మక్కళ్ కచ్చి , ఏఐఎడీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ప్రస్తుతం జీ.కే. మణి నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ తమకు 25 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో పీఎంకే కి ప్రాతినిధ్యం లేదు. ఉత్తర తమిళనాడులో కులపరంగా బలమైనదిగా ముద్ర గల ఈ పార్టీ..తమవర్గ వన్నియార్ల ప్రయోజనాలకోసం పోరాడుతోంది. 2011 లో ఇది డీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లు గెలుచుకుంది. కానీ 2016 లో జరిగిన ఎన్నికల్లో 30 స్థానాలకు పోటీ చేసినప్పటికీ ఆ మూడు సీట్లను కూడా కోల్పోయింది.2006-2011 మధ్య ఈ పార్టీ ఒక దశలో అధికార పగ్గాలను చేబట్టింది.

ఇలా ఉండగా తాజాగా అన్నా డీఎంకె…. బీజేపీతో కూడా చర్చల ప్రక్రియను ప్రారంభించింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డితో బాటు తమ రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపారు. హోం మంత్రి అమిత్ షా ఈ రాత్రి చెన్నై చేరుకొని అన్నాడీఎంకేతో పొత్తు విషయాన్ని  ఖరారు చేస్తారని భావిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో అన్నా డీఎంకే… బీజేపీకి 20 సీట్లు కేటాయించవచ్చునని అంటున్నారు. ఇక డీఎంకే తన మిత్ర పక్షాలతో సీట్ల పంపిణీకి సంబంధించి టీ.ఆర్. బాలు నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. కాంగ్రెస్ పార్టీతో రెండో దఫా చర్చలు రేపో, మాపో జరగవచ్చునని తెలుస్తోంది. వీరి తొలి దఫా చర్చల్లో ఊమెన్ చాందీ, దినేష్ గుండూ రావు, రణదీప్ సింగ్ సూర్జేవాలా పాల్గొన్నారు. మరోవైపు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పాల కరుపయ్య శనివారం కమల్ హాసన్ ఆద్వర్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీలో చేరారు. ఆయనకు ఈ పార్టీ టికెట్ ఇవ్వవచ్చు. ఇక శరత్ కుమార్ శనివారం కమల్ హాసన్ ను కలిశారు. భావసారూప్యం గల వ్యక్తులను కలుసుకోవడంతో తప్పు లేదని ఆయన చెప్పారు. శరత్ కుమార్ భార్య, నటి రాధికా శరత్ కుమార్ అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళను కలుసుకోవడం విశేషం.

 

Read More:

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి

Post Office Life Insurance Polices: పోస్టాఫీసుల్లో జీవిత బీమా పాలసీలు కలిగి ఉన్నారా..? అయితే మీకో శుభవార్త