కాంగ్రెస్, డీఎంకేలు మహిళలకు భద్రత కరువు.. మధురై ప్రచార సభలో మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ

|

Apr 02, 2021 | 4:28 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ద్రవిడనాట రాజకీయాలు ఇప్పడు మహిళల చుట్టూ తిరుగుతున్నాయి.

కాంగ్రెస్, డీఎంకేలు మహిళలకు భద్రత కరువు.. మధురై ప్రచార సభలో మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ
Pm Narendra Modi In Madurai Election Campaign
Follow us on

Tamil Nadu election 2021: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ద్రవిడనాట రాజకీయాలు ఇప్పడు మహిళల చుట్టూ తిరుగుతున్నాయి. దైవ నిలయంగా భావించే తమిళనాట మహిళలకు రక్షణ కరువైందన సాక్ష్యాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తమిళనాడులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం, భద్రతను కాంగ్రెస్, డీఎంకేకు కల్పించలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

మదురైలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాుతూ, నారీ శక్తి ప్రాధాన్యత గురించి మదురై ఎన్నో పాటలు చెప్పిందన్నారు. మహిళలను ఏవిధంగా గౌరవించాలో, ఏవిధంగా ఆరాధించాలో ఇక్కడ చూడవచ్చని అన్నారు. డీఎంకే కానీ , కాంగ్రెస్ కానీ ఎప్పుడూ మహిళలను గౌరవించడం, భద్రత కల్పించడం చేయవని, డీఎంకే ఫస్ట్ ఫ్యామిలీలోని కలహాల కారణంగా శాంతిని ప్రేమించే మదురైను మాఫియాకు నిలయంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు పదేపదే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు.


మదురై ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారని, రాజకీయ పార్టీల గుణగణాలను గుర్తించి అభివృద్ధికి భరోసా ఇస్తున్న ఎన్డీయేకు ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందని ప్రధాని అన్నారు. టెక్స్‌టైల్ రంగంలో మరింత యాంత్రీకరణ, రుణ సౌలభ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మెగా-ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్ పథకం ‘MITRA’ను ప్రకటించామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, ఈనెల 6న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Read Also…  యూడీఎఫ్, ఎల్డీఎఫ్ నేతలు సంస్కృతిసాంప్రదాయాలను కాలరాస్తున్నారు.. కేరళ ప్రచారంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు