ప్రధాని మోదీ సార్.. మా నియోజకవర్గంలో ప్రచారం చేయండి.. వేడుకుంటున్న డీఎంకే పార్టీ నేతలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

|

Apr 02, 2021 | 9:44 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ తేదీ దగ్గరపడడంతో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ప్రధాని మోదీ సార్.. మా నియోజకవర్గంలో ప్రచారం చేయండి.. వేడుకుంటున్న డీఎంకే పార్టీ నేతలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
Dmk Leaders Satirical Tweets On Modi
Follow us on

Tamil Nadu Election 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ తేదీ దగ్గరపడడంతో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అధికార విపక్షనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏఐఏడీఎంకే, పీఎంకే, బీజేపీ కూటీమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీ తరుఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్‌ షోలతో అదరగొడుతున్నారు.

అయితే మోదీ – షా ప్రచారం తమ అభ్యర్థులకు ఎంత కలిసొస్తుందో తెలియదు కానీ.. తమకు మాత్రం బాగా కలిసొస్తుందంటూ డీఎంకే నేతలు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీజీ.. మా నియోజకవర్గానికి ప్రచారానికి రండి అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానిగారు.. దయచేసి మా నియోజకవర్గంలోని ఏఐఏడీఎంకే, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయండి. మేం భారీ తేడాతో గెలిచేందుకు మీ ప్రచారం సహకరిస్తుందంటూ డీఎంకే నేతలు వ్యగ్యంగా ట్వీట్లు చేశారు.


ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ.. నేను కుంభం నియోజకవర్గంలో డీఎంకే తరఫున బరిలో ఉన్నాను. మా నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తే భారీ తేడాతో గెలుస్తాను అంటూ డీఎంకే నేత రామక్రిష్ణన్ ట్వీట్ చేశారు.

దివంగత నేత జయలలిత ఆధ్వర్యంలోని ఏఐఏడీఎంకే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లు సాధించి విజయం సాధించింది. అయితే, జయలలిత 2016 డిసెంబర్‌లో మరణించారు. డీఎంకే అధినేత స్టాలిన్ తండ్రి ఎం కరుణానిధి ఆగస్టు 2018 లో మరణించారు. 2019 ఎన్నికల్లో 39 లోక్‌సభ స్థానాల్లో 38 లో డీఎంకే, దాని మిత్రపక్షాలు గెలిచాయి. తమిళనాడులో తొలిసారి ఇద్దరు ముఖ్యనేతలు లేకుండానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఏప్రిల్ 6 న తమిళనాడులో 234 స్థానాలకు సింగిల్-ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఏఐఏడీఎంకే – బీజేపీ కూటమిని డీఎంకే ఢీకొంటోంది. 2018లో తన తండ్రి ఎం కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ డీఎంకే బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయంతో ఏఐఏడీఎంకే పదేళ్ల పాలనను అంతం చేయాలని డీఎంకే భావిస్తోంది.

కాగా డీఎంకే అభ్యర్థికి మద్దతుగా మరో డీఎంకే నాయకుడు కుంబున్ ఎన్ రామకృష్ణ ఇలాంటి సందేశాన్నే ట్వీట్ చేశారు.”ప్రియమైన ప్రధాని నరేంద్ర మోడీ, దయచేసి కుంబం నియోజకవర్గంలో ప్రచారం చేయండి. నేను ఇక్కడ డీఎంకే అభ్యర్థిని, నా గెలుపు మార్జిన్‌ను విస్తృతం చేయడంలో ఇది నాకు సహాయపడుతుంది. ధన్యవాదాలు సర్” అంటూ ట్వీట్ చేశారు.


గత వారం రోజులుగా ఆదాయపు పన్ను అధికారులు.. సెల్వరాజ్ కె, తడంగం పి సుబ్రమణి, అనితా అంబేత్ కుమార్ తదితరుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఇవి వేలు ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో తమ కోసం ప్రచారం చేయాలని పీఎం మోదీని కోరుతూ ఒక ట్వీట్ చేశారు.


ఎఐఎడిఎంకె అభ్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తోండముత్తూర్‌లో ప్రచారం చేయాలని డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనపతి ప్రధానమంత్రిని కోరారు. ఎందుకంటే “మీరు ఆయనకు మద్దతు ఇస్తే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.” అంటూ సెటైర్ వేశారు.


Also Read:దీదీని గద్దె దించండి.. ఒక్క పిట్టను కూడా బెంగాల్‌లో అడుగుపెట్టనీయం.. అలిపుర్దూరు ప్రచారసభలో కేంద్రమంత్రి అమిత్ షా