తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఈమె చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక్కడ డీఎంకేకి చెందిన డా.ఎజిలాన్ ను ఎదుర్కోనున్నారు. తనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇఛ్చి పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఖుష్బూ…. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాని మోదీకి ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పార్టీ కోసం తాను శ్రమిస్తానని, గెలిచి తీరుతానని ఆమె అన్నారు. గత ఏడాది ఈమె కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన తన రాజీనామా లేఖలో..అసలు పార్టీతో ఎలాంటి సంబంధం లేనివారి కారణంగా తాను అణచివేతకు గురయ్యానని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి ప్రజా సమస్యలతో సంబంధమే లేదని, పార్టీ కోసం కష్ట పడుతున్న తనలాంటి వారిని వారు శాసిస్తున్నారని ఖుష్బూ ఆరోపించారు.
ఇక ఈ వైఖరితో తను విసుగెత్తిపోయానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఖుష్బూ డీఎంకేలో కొంతకాలం పాటు కొనసాగారు. కాగా… బీజేపీ అభ్యర్థులుగా తమిళనాడు పార్టీ అధ్యక్షుడు మురుగన్ తరపురం నుంచి, హెచ్.రాజా కరైకుడి నుంచి పోటీ చేస్తుండగా..వనతి శీనివాసన్ కోయంబత్తూర్ సౌత్ లో కమల్ హాసన్ ను ఎదుర్కోనున్నారు. (వీరి పేర్లు ఈ మొదటి జాబితాలో ఉన్నాయి). నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ జాబితాను ఖరారు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా పాల్గొన్నారు.
I thank @BJP4India from the bottom of my heart for giving me the opportunity to contest from #thousandlights in the upcoming #TamilNaduElections2021 Promise to work hard and win. @BJP4TamilNadu @kishanreddybjp @Murugan_TNBJP @ReddySudhakar21 @blsanthosh @AmitShah @narendramodi
— KhushbuSundar ❤️ (@khushsundar) March 14, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video