Akhilesh Yadav: మేము 304 స్థానాల్లో విజయం సాధించాం.. మరోసారి అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు

|

Mar 15, 2022 | 5:55 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి స్పందించారు. ఎస్పీ సారథ్యంలోని తమ కూటమి.. పోస్టల్ బ్యాలెట్లో 51.5శాతం ఓట్లు సాధించిందన్నారు. దీన్నిబట్టి చూస్తే తాము....

Akhilesh Yadav: మేము 304 స్థానాల్లో విజయం సాధించాం.. మరోసారి అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు
Akhilesh
Follow us on

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి స్పందించారు. ఎస్పీ సారథ్యంలోని తమ కూటమి.. పోస్టల్ బ్యాలెట్లో 51.5శాతం ఓట్లు సాధించిందన్నారు. దీన్నిబట్టి చూస్తే తాము 304 సీట్లు గెలుచుకున్నట్టు తెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కూటమికి 51.5శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం తమ కూటమి 304 సీట్లలో విజయం నమోదు చేసిందన్న వాస్తవం అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలోనూ అఖిలేశ్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీకి గతంలో కంటే సీట్ల సంఖ్య బాగా పెరిగిందన్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభావం మరింత తగ్గుతుందన్నారు. “యూపీ ఎన్నికల్లో సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని 1.5 రెట్లు పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని మేం నిరూపించాం. ఆ పార్టీకి ఉన్న భ్రమలు సగానికి పైగా తొలగిపోయాయి. ముందు ముందు పూర్తిగా పోతాయని అఖిలేశ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ మోదీ-యోగి వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. ఈ ఎన్నికల్లో భాజపా 255 సీట్లతో భారీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికార పీఠం నిలుపుకోగా.. సమాజ్ వాదీ పార్టీ 111 స్థానాలతో బలం పుంజుకొంది. సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి ఎనిమిది సీట్లు వచ్చాయి.

Also Read

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!

Narendra Modi : “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ప్రతి ఒక్కరూ చూడాలని సూచన

Alia Bhatt : బర్త్ డే గిఫ్ట్ .. ‘బ్రహ్మాస్త్ర’ అలియా గ్లిమ్ప్స్ వచ్చేసింది.. అదరగొట్టిన అందాల భామ..