పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో రభస, గందరగోళం, కలబడిన నేతలు, అదనపుఁ బలగాల మొహారింపు

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆదివారం గందరగోళం నెలకొంది. నేతలు ఒకరికొకరు దుర్భాషలాడుకుంటూ దాడులకు పాల్పడినంతగా రెచ్చిపోయారు. సమావేశం జరుగుతుండగా ఓ నేత...

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో రభస, గందరగోళం, కలబడిన నేతలు, అదనపుఁ బలగాల మొహారింపు
Ruckus At Congress' Cec Meet In Puducherry

Edited By:

Updated on: Mar 14, 2021 | 4:35 PM

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆదివారం గందరగోళం నెలకొంది. నేతలు ఒకరికొకరు దుర్భాషలాడుకుంటూ దాడులకు పాల్పడినంతగా రెచ్చిపోయారు. సమావేశం జరుగుతుండగా ఓ నేత డీఎంకే పతాకాన్ని ప్రదర్శించడంతో గొడవ మొదలైంది. ఈ మీటింగ్ లో  మరో  పార్టీ జెండాను ప్రదర్శిస్తావా అంటూ కాంగ్రెస్ సభ్యుడొకరు ఆయనపై చిందులు వేయడంతో ఆయన కూడా..అదే స్థాయిలో తిరగబడ్డారు. ఇద్దరి మధ్యా మాటల యుధ్దం దాటి కొట్టుకునేంతవరకు వెళ్ళింది. అయితే ఇతర నేతలు వచ్చి వారికి  సర్ది చెప్పారు.ఈ కేంద్ర పాలితప్రాంతంలో  జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఈ సమావేశం జరిగింది.   మాజీ  సీఎం వీ.నారాయణస్వామి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎలెక్షన్స్ లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 15 సీట్లకు, డీఎంకే 13 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఏప్రిల్ 6 న ఒకే దశలో పుదుచ్చేరి ఎన్నికలు  జరగనున్నాయి. నేటి సమావేశంలో పార్టీ నేతల ఫిస్ట్ ఫైట్ వీడియోకెక్కింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను రప్పించారు.

పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని డీఎంకే ఇన్ని అత్యధిక సీట్లకు పోటీ చేయడం ఇదే మొదటిసారి.  గత ఎన్నికల్లో ఈ పార్టీ తొమ్మిది స్థానాలకు పోటీ చేసి రెండింట గెలిచింది. కాంగ్రెస్ 21 స్థానాలకు పోటీ చేసి 15 సీట్లలో గెలిచింది.అయితే ఎన్నికల ముందు ఇద్దరు మంత్రులతో సహా ఏడుగురు ఎమ్మెల్యేలుపార్టీని వీడడంతో అభ్యర్థుల ఎంపిక ఈ పార్టీకి కష్ట సాధ్యమైంది.  ఈ  పరిస్థితిని ఆసరాగా చేసుకుని డీఎంకే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది.  ఇక నియోజకవర్గాలను పంచుకోవడంలో రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. కాగా ఏప్రిల్ 6 న ఒకే దశలో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :  సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video

పొట్టేలుతో సెల్ఫీ కోసం ట్రై చేసిన యువతికి మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది వైరల్ గా మారిన వీడియో : Girl selfie With Goat