ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య.. అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్..

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు బీ ఫామ్‌ అందుకోవడమే ఆలస్యం నామినేషన్‌ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అఫిడవిట్‎లో రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదని హెచ్చరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య.. అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్..
Nomination
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 24, 2024 | 6:05 PM

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు బీ ఫామ్‌ అందుకోవడమే ఆలస్యం నామినేషన్‌ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అఫిడవిట్‎లో రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదని హెచ్చరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.

తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అందుకే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, తమపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అధికారికి ఇవ్వడంతో పాటు మీడియా ద్వార ప్రజలకు తెలపాలన్నది ఈసీ నిబంధన. ఇదే ఇప్పుడు ఎలక్షన్లలో పోటీకి రెడీ అవుతున్న అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. ఒకవేళ ఏదైనా సమాచారం దాస్తే.. ఆ తరువాత కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెంతున్నారు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్ధులు. అందుకే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న అభ్యర్థులను ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్ ఆందోళనకు గురిచేస్తోంది. నామినేషన్ సందర్బంగా దాఖలుచేసే అఫిడవిట్ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం సూచిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, అఫిడవిట్లలో చేసిన కొన్ని పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో ఈ సారి అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.

ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు దాఖలు చేసే అఫిడవిట్ల విషయంలో కఠిన నిబంధనలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అఫిడవిట్‌లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందుగా స్థానికంగా ఉన్న న్యూస్ పేపర్లు, న్యూచ్ ఛానల్స్‎లో ప్రకటనల ద్వారా క్రిమినల్‌ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ ముక్కూ మొఖం తెలియని పత్రికలు, ఛానల్స్‎లో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు లేదంటే గెలిచిన తరువాత అనర్హతకు గురవుతారని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.

ఇవి కూడా చదవండి

అభ్యర్ధులు సమర్పించే ఎన్నికల అఫిడవిట్‎లో వివరాలు పూర్తిగా ఉన్నాయా? లేదా అనేది కూడా అధికారులు జాగ్రత్తగా చూడాలని, లేదంటే వారిపై కూడా చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. చాలా రాష్ట్రాల్లో అఫిడవిట్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేసులు నమోదయ్యాయి. దీంతో నామినేషన్ల పరిశీలనలో ఎక్కువ టైం అఫిడవిట్ కోసం తీసుకోనున్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారం సందర్బంగా అభ్యర్థుల ఖర్చుల విషయంలోనూ చేసిన కొన్ని పొరపాట్లకు కొందరిపై అనర్హత వేటు పడింది. దీంతో ఎలక్షన్లల్లో గెలవడం ఎంత ముఖ్యమో, నామినేషన్ సందర్భంగా ఇచ్చే అఫిడవిట్, ప్రచారంలో చేసే ఖర్చును జాగ్రత్తగా చూపించడం అంతకంటే ముఖ్యంగా మారింది. గతంలో కొందరిపై ఎన్నికల్లో ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేశారని, ఎన్నిక చెల్లదని కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో అఫిడవిట్ల తయారీకి, ఎలక్షన్ ఖర్చుకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు నిపుణులతో కూడిన స్పెషల్ టీమ్స్‎ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..