ఖాళీ కడుపుతో ఇవి తాగండి.. షుగర్ కంట్రోల్ అవుతుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల షుగర్ క్రమంగా కంట్రోల్‌లోకి వస్తుంది.
మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచడానికి దాల్చిన చెక్క కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. టీలో దాల్చిన చెక్క ముక్క వేసుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
ఉసిరిలో కూడి మధుమేహాన్ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. ఉదయగానే కాస్త ఉసిరి రసాన్ని తీసుకుంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఇక కలబంద రసం కూడా షుగర్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో కొద్దిగా కలబంద రసాన్ని తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది.
తులసి ఆకుల్లో ఉండే ఎన్నో గుణాలు డయాబెటిక్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోపగడతాయి. ప్రతీ రోజూ ఉదయాన్నే తులసి ఆకులతో చేసిన టీ ని తీసుకోవాలి.
ఇక డయాబెటిస్‌తో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే చక్కెర కంటెంట్ డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం