TV9 Telugu

05 May 2024

గర్భదారణ సమయంలో వాంతులా.? ఇలా చేయండి

గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగానే వాంతులు అవుతాయి. ముఖ్యంగా శరీరంలో పెరిగే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కారణంగా వికారం కలుగుతుంది.

వాంతుల నుంచి ఉపశమనం లభించాలంటే ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక వీలైనంత వరకు ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్‌లు తీసుకోవాలి. సాలిడ్‌ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. 

వాంతుల నుంచి ఉపశమనం లభించాలంటే ఎండు ఉసిరిని బుగ్గనపెట్టుకొని నెమ్మదిగా చప్పరించాలి. ఇలా చేయడం వల్ల కూడా వాంతులు రావడం ఆగిపోతాయి. 

 కడుపులో వికారం మొదలైతే కొద్దిగా నిమ్మరసం తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి.

తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాసేపు నడిచిన తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. ఇక కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

గర్భిణీలు వికారంగా అనిపిస్తే ఒక చిన్న అల్లం ముక్క వాసన చూసినా ఉపశమనం లభిస్తుంది. అలాగే మార్కెట్లో దొరికే అల్లం మురబ్బా తీసుకున్నా వాంతులు తగ్గిపోతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.