Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..

|

Mar 10, 2022 | 12:34 PM

Markets Rally: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్స్ వెలువడడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది. ఇదే సమయంలో కాషాయ పార్టీ(BJP Party) హవా ఇన్వెస్టర్లలో దైర్యాన్ని నింపడంతో సూచీలు జోరందుకున్నాయి.

Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..
Election Effect On Market
Follow us on

Markets Rally: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్స్ వెలువడడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది. ఇదే సమయంలో కాషాయ పార్టీ(BJP Party) హవా ఇన్వెస్టర్లలో దైర్యాన్ని నింపడంతో సూచీలు జోరందుకున్నాయి. దలాల్ స్ట్రీట్(Dalal Street) లో బుల్ జోరు కొనసాగడంతో ప్రధానంగా బ్యాంకింగ్ రంగం ఊపందుకుంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 1500 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసింది. అంతకు ముందు రెండు వారాల పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్ఛితి వంటి అనేక కారణాలతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలతో పతనమయ్యాయి. ఈ కాలంలో అత్యధికంగా మదుపరుల సంపద 25 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. ఇదే సమయంలో విదేశీ మదుపరుతు సైతం భారీగా మన మార్కెట్ల నుంచి తరలిచడంతో పరిస్థితి దారుణంగా మారింది. కానీ.. నేడు వీటన్నిటినీ దాటుకుని కౌంటింగ్ ప్రారంభం కావటం వల్ల.. మార్కెట్లు ప్రారంభంలోనే భారా గ్యాప్ అప్ తో ప్రారంభమయ్యాయి.

ఇదే సమయంలో నిన్న చల్లబడ్డ క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మళ్లీ నేడు పుంజుకున్నాయి. యూరోపియన్ దేశాలు తమ అవసరాల కోసం రష్యా నుంచి గ్యాస్, చమురును దిగుమతి చేసుకోవడాాన్ని పూర్తిగా నిపివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవటం కూడా దీనికి మరో కారణంగా చెప్పుకోవాలి. రష్యా నుంచి ఇంధన దిగుమతులు బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినప్పటికీ అది ఇప్పుడప్పుడే అసాధ్యంగా కనిపిస్తోంది.

నిన్న ఆరంభంలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 124.66 డాలర్లు ఉండగా.. సాయంత్రానికి 108.70 వద్ద ముగిసింది. అంటే 16 డాలర్లు మేర తగ్గింది. గానీ నేడు మళ్లీ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ 110 డాలర్లకుపైగా ఉంది.

ఇవీ చదవండి..

Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..

Investors’ Wealth Jump: బుర్ రన్ తో పెరిగిన మదుపరుల సంపద.. ఒక్కరోజే రూ. 5.4 లక్షల కోట్ల పెరుగుదల..

Donald Trump: ​ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పించుకున్న మాజీ అధ్యక్షుడు..