యూపీలో యోగికే(UP Election 2022) మళ్లీ బ్రహ్మరథం , పంజాబ్‌లో ఆప్(App) ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనా వేశాయి. గోవా,ఉత్తరాఖండ్‌లో బీజేపీ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్ మరోసారి యోగికే పట్టం కడుతుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెప్పాయి. బీజేపీ 40 శాతం ఓట్లతో 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని TV9-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్‌పోల్ చెప్పింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు, బీఎస్పీకి 14 నుంచి 24, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని TV9-పోల్‌స్ట్రాట్ తెలిపింది. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీకి ఎగ్జిట్‌పోల్స్ పట్టం కడితే, ఉత్తరాఖండ్‌లో హోరా హోరీ, గోవాలో హంగ్ రావచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి. మణిపూర్‌లో బీజేపీకి ఎక్కువ విన్నింగ్ చాన్స్ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
రిపబ్లిక్-P మార్క్ సర్వే యూపీలో బీజేపీకి 240 సీట్లు వస్తాయనీ, SPకి 140, BSPకి 17 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ఇండియా టుడే-యాక్సిస్ సర్వేలో బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. యూపీలో బీజేపీకి 288-326 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఎస్పీకి 71-101 సీట్లు వచ్చే అవకాశముంది. బీఎస్పీకి 3-9 సీట్లు కాంగ్రెస్‌కు 3 సీట్లు వచ్చే అవకాశముందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక ఇండియా టుడే-యాక్సిస్ సర్వే పంజాబ్లో ఆమ్‌ఆద్మీకి 76 నుంచి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 31 సీట్లు వస్తాయిన తెలిపింది. ఇక న్యూస్-24, ABP-C ఓటర్ సర్వే ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్-బీజేపీల మధ్య గట్టిపోరాటం ఉంటుందని తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 26-32 , కాంగ్రెస్‌కు 32-38 సీట్లు ఆప్‌కు 2 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. గోవాల్‌లో కూడా కాంగ్రెస్ , బీజేపీ మధ్య నువ్వా ? నేనా అన్న రీతిలో పోటీ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గోవా , ఉత్తరాఖండ్‌లో చిన్న పార్టీలు , స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముంది. జయం మనదే అంటున్నారు సమాజ్‌వాది చీఫ్ అఖిలేష్ యాదవ్. తమ నేతృత్వంలోని కూటమి 300 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడిన పార్టీ మరొకటి లేదన్నారు అఖిలేష్ యాదవ్. ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనని బీజేపీ నేత, యూపీ సీఎం యోగి ధీమాగా చెప్పారు. ప్రజలు మళ్లీ తమనే ఆశీర్వదిస్తారని చెప్పారాయన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు- ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు యోగి.
ఎగ్జిట్‌పోల్స్ రావడంతో ఆమ్‌ఆద్మీ జోష్ మీద ఉంటే, కాంగ్రెస్ లైట్ తీసకుంటోంది. పంజాబ్‌లో తమకు 80 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని- ఆమ్‌ఆద్మీ నేత, ఆ పార్టీ CM అభ్యర్థి భగవంత్ మాన్ చెప్పారు. అయితే పంజాబ్ CM ఛన్నీ మాత్రం- పదో తేదీ వరకు వేచిచూస్తామన్నారు. ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాలే చెబుతాయంటూ ఎగ్జిట్‌పోల్స్‌ను కొట్టిపారేశారు.
ఇవి కూడా చదవండి: TV9 Exit Poll Results 2022: యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీకి అధికారం..? ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనాలు..
Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..