Bengali actor Yash Dasgupta: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు టీఎంసీ నాయకులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా కూడా బుధవారం బీజేపీలో చేరారు. పశ్చిమబెంగాల్ బీజేపీ ఇన్‌చార్జి కైలాష్ విజయ వర్గీయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా సమక్షంలో యష్ దాస్‌గుప్తా బీజేపీలో చేరారు. ఆయనతోపాటు పార్టీలో చేరిన పలువురికి కైలాష్ విజయ వర్గీయ, ముకుల్ రాయ్ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా యష్ దాస్‌గుప్తా మీడియాతో మాట్లాడారు. వ్వవస్థను మార్చాలని అనుకుంటే అందరూ దానిలో భాగం కావాలని పేర్కొన్నారు. ఇంటిపేరు, రాజకీయ నేపథ్యం, మొదలైన వాటితో సంబంధం లేకుండా యువతను బలంగా విశ్వసించే పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ భావాలతో తన ఆలోచనలు కలుస్తాయని అందుకే పార్టీలో చేరినట్లు యశ్ దాస్‌గుప్తా వెల్లడించారు.
యష్ దాస్‌గుప్తా 2016లో ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం వన్, మన్ జానే నా, టోటల్ దాదాగిరి పలు బెంగాలీ చిత్రాల్లో నటించారు.
Also Read: