సీబీఐ చేతిలో వివేకా ఇంటి బ్లూ ప్రింట్..కీలక ఆధారమేనా?

|

Jul 21, 2020 | 7:14 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నాలుగో రోజు సీబీఐ దర్యాప్తు ముగిసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందం...

సీబీఐ చేతిలో వివేకా ఇంటి బ్లూ ప్రింట్..కీలక ఆధారమేనా?
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. నాలుగో రోజు సీబీఐ దర్యాప్తు ముగిసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందం..పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించింది. పులివెందుల పట్టణంతో పాటు పరిసర గ్రామాలను పరిశీలించారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు బ్లూ ప్రింట్ తీసుకున్నట్లు సమాచారం. వివేకానందరెడ్డి కూతురు సునీత సీబీఐ అధికారులకు పలువురు అనుమానితుల పేర్లను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సునీత ఇచ్చిన వివరాల మేరకు సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగనున్నట్లు సమాచారం.

సోమవారం వివేకానందరెడ్డి కుటుంబీకులను సుదీర్ఘంగా విచారించింది సీబీఐ. ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతో పాటు మిగతా కుటుంబ సభ్యులను దాదాపు 3 గంటలకు పైగా సీబీఐ బృందం విచారించింది. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు 16 నెలలు పాటు జరిగిన అన్ని పరిస్థితులపై విచారించినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన వివేకానంద రెడ్డి బెడ్‌రూమ్, మృతదేహం లభ్యమైన బాత్రూమ్‌లోనూ క్షుణ్ణంగా పరిశీలించారు.

2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇంట్లోనే ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు, ఇతర గాయాలు కనిపించాయి. అప్పట్లో తీవ్ర దుమారం రేపిన వివేకా హత్యకేసు విచారణ చేపట్టిన సిట్‌ దర్యాప్తులో పలు అనుమానాలు ఉన్నాయనంటూ వివేకా కుమార్తె సునీత సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ విచారణపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసులో అసలైన నేరస్తులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యను ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.