ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై‌.. ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ పెరిగిపోతుంది. వాటికి బానిసలుగా మారుతోన్న కొందరు భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై‌.. ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

Edited By:

Updated on: Aug 03, 2020 | 12:49 PM

Online Gambling Game: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కల్చర్‌ పెరిగిపోతుంది. వాటికి బానిసలుగా మారుతోన్న కొందరు భారీగా డబ్బులు పోగొట్టుకుంటూ, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాలలో ఆన్‌లైన్‌ గేమింగ్ సైట్‌ ద్వారా 7 లక్షలు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

కర్నూల్‌కి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌కి అలవాటు పడి 6 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి ఆన్‌లైన్‌ ఎక్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు..స్నేహితుల దగ్గర అప్పుల పాలు అవ్వడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా తెలంగాణలో గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ అమలులో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో డబ్బు చెల్లించి ఆడే ఆన్‌లైన్‌ గేమ్స్ నిషేధం. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొంత మంది పంటర్లు.. బాధితుడిని నుండి డబ్బు తీసుకుని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో డబ్బు పెట్టిన యువత భారీగా నష్టపోతున్నారు. తిరిగి అప్పులు చెల్లించలేక ఆత్మ హత్యలకు పాలపడుతున్నారు.

Read This Story Also: ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు