క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత.. ప్రేమ పేరుతో నయవంచనకు గురై ఒకరు.. పేరెంట్స్ తిట్టారని మరొకరు..!

|

Oct 04, 2021 | 7:36 PM

తెలిసీ తెలియని వయస్సు..క్షణికావేశంలో..ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసానికి గురైన యువతి హృదయం తట్టుకోలేక సూసైడ్‌ చేసుకుంది. ఇటు హైదరాబాద్‌లోనూ తల్లిదండ్రులు మందలించారని ఓ చిన్నారి ఆత్మహత్య.

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత.. ప్రేమ పేరుతో నయవంచనకు గురై ఒకరు.. పేరెంట్స్ తిట్టారని మరొకరు..!
Ends Lives
Follow us on

Youngsters Ends Life: తెలిసీ తెలియని వయస్సు..క్షణికావేశంలో..ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసానికి గురైన యువతి హృదయం తట్టుకోలేక సూసైడ్‌ చేసుకుంది. ఇటు హైదరాబాద్‌లోనూ తల్లిదండ్రులు మందలించారని ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. తల్లాడకు చెందిన వర్షిత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచస్తోంది. అదే ఆస్పత్రిలో పనిచేసే మధుతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో మధు యువతిని లోబర్చుకొని..ఆ తర్వాత టార్చర్‌ మొదలుపెట్టాడు. యువతిని బెదిరించి డబ్బులు తీసుకునేవాడని సమాచారం. ఈ మధ్యే ఖమ్మంలోని రోహిత్‌ టెస్ట్‌ ట్యూబ్‌బేబీ ఆస్పత్రిలో జాబ్‌ కోసం వచ్చిన యువతి…ఓ ప్రైవేట్‌ హాస్టల్లో ఉంటోంది. అప్పటికే వివాహమైన మధు…వర్షిత ఫొటోలు, ఫోన్‌ తీసుకొని మళ్లీ టార్చర్‌ పెట్టాడు. దాంతో మనస్తాపానికి గురైన యువతి స్టెరాయిడ్స్‌ తీసుకొని సూసైడ్‌ చేసుకుంది.

యువతి మృతికి కారణమైన మధును కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కూలి చేసుకొని బ్రతికే తల్లిదండ్రులకు ఆసరా అవుతుందని అనుకున్న బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.

ఇటు, హైదరాబాద్‌ మీర్‌పేట సర్వోదయనగర్‌లోనూ విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ క్లాస్‌ పుణ్యమో..లేక మరో కారణమో తెలియదు కానీ…పిల్లల చేతిలో సెల్‌ఫోన్లు అనర్థాలకు దారి తీస్తున్నాయి. సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నావంటూ కన్నతండ్రి మందలించడంతో ఆ చిన్నారి మనస్సు చివుక్కుమంది. తీవ్ర మనోవేదనకు గురైంది. పేరెంట్స్‌ ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకుంది. నిత్యం అల్లారుముద్దుగా కళ్ల ముందు తిరిగే చిన్నారి ఇక లేదనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also..  AP Covid-19: ఏపీలో మళ్లీ మొదలైన కరోనా గుబులు.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?