Crime News: ప్రేమ మైకంలో ప్రియుడితో కలసి కన్నతల్లిని కడతేర్చిన యువతి.. ప్రేమికులనిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

|

May 12, 2021 | 11:27 PM

Crime News: ప్రేమ మైకంలో కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. తన ప్రియుడితో వేషాలు వేయొద్దని తల్లి హెచ్చరించినందుకు ఆ ప్రియుడితోనే కలసి ఆమె ఉసురు తీసేసింది.

Crime News: ప్రేమ మైకంలో ప్రియుడితో కలసి కన్నతల్లిని కడతేర్చిన యువతి.. ప్రేమికులనిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
Crime News
Follow us on

Crime News: ప్రేమ మైకంలో కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. తన ప్రియుడితో వేషాలు వేయొద్దని తల్లి హెచ్చరించినందుకు ఆ ప్రియుడితోనే కలసి ఆమె ఉసురు తీసేసింది. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లలో చోటు చేసుకుంది. విజయనగరం డీఎస్పీ అనిల్‌ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న కన్నతల్లిని చంపేసింది. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసి కటాకటాల్లోకి పంపారు. ఈనెల 6న లక్ష్మి (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు కేసు నమోదైంది. వైద్యులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో విస్తుగోలిపే నిజం బయటకు వచ్చింది. రూపశ్రీ అనే అమ్మాయి వరుణ్ సాయి అనే అబ్బాయిని ప్రేమించింది. అతనిని పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పింది. కానీ, ఆ తల్లి కుమార్తె మాటను మన్నించలేదు. ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంది. దీంతో రూపశ్రీ, వరుణ్ సాయి ఇద్దరూ కలసి ఆమెను చంపడానికి నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని ప్రియుడి సాయంతో దిండుతో అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేసింది రూపాశ్రీ. స్పృహ కోల్పోయిన తల్లి లక్ష్మి చనిపోయిందని ఆమె భావించింది. దీంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత రూపశ్రీ ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది. కిందపడి తల్లి చనిపోయిందంటూ సహజ మరణంగా నమ్మబలికింది. అయితే, తండ్రి అక్కడి ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి వచ్చిన ఆర్‌ఎంపీ డాక్టర్ ఇవ్వడంతో అతడు లక్ష్మిని పరిశీలించి ప్రాణం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. ఆ డాక్టర్ కు లక్ష్మి మరణం సహజమైనది కాదని అనుమానం వచ్చింది. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు రూపశ్రీ, వరుణ్‌సాయిలను అరెస్ట్‌ చేశారు.