లారీ – బైక్ ఢీ.. యువకుడు మృతి

వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. వరంగల్- ఖమ్మం రోడ్డులో సోమవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు.

లారీ - బైక్  ఢీ.. యువకుడు మృతి

Updated on: Aug 17, 2020 | 9:41 PM

వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. వరంగల్- ఖమ్మం రోడ్డులో సోమవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన చెంగల సురేశ్‌(22)వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్‌పై ఖమ్మం రోడ్డులో వెళ్తున్నాడు. అదే రోడ్డులో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సురేశ్‌ ఒక్కసారి రోడ్డుపై ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.